Siri : ఇప్పటివరకు బిగ్ బాస్ షో వల్ల ప్రేమలు చిగురించడం చూసుంటాం.. బిగ్ బాస్ సీసన్ 5 ద్వారా రిలేషన్ షిప్ లు బ్రేక్ అవుతాయని కూడా తెలిసింది. యూట్యూబర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి..సిరి తో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుని వచ్చాడు. హౌస్ లో సిరి తో ఫ్రెండ్ షిప్ అంటూ హద్దులు మీరి హగులు ఇచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వల్ల తన క్యారెక్టర్ని తానే దిగజార్చుకున్నాడు షణ్ముఖ్.. సిరి పై షణ్ముక్ తరుచు అరవడం అతనికి మైనస్ అయిందనే చెప్పాలి.. ఈ మేరకే టైటిల్ కొట్టాల్సినోడు.. రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే హౌస్ లో నుండి బయటకు వచ్చిన షణ్ముఖ్ దీప్తి తో లవ్ బ్రేకప్ కి సిరే కారణమంటూ అప్పట్లో సోషల్ మీడియాలో షన్ను ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు.
అప్పట్లో షన్ను దీప్తి ల లవ్ బ్రేకప్ సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయిదేళ్లుగా ప్రేమలో కొనసాగిన వీళ్లు అంత కఠిన నిర్ణయం తీసుకోవడం అందరిని షాక్ కి గురిచేసింది. బిగ్ బాస్ ఫినాలే వరకు షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తూ వచ్చిన దీప్తి.. ఆ రియాల్టీ షో ముగిసిన తర్వాత అలాంటి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ హౌస్ లో నుండి షణ్ముక్ బయటకు వచ్చిన తర్వాత.. దీప్తి షన్ను తో తెగదింపులు చేసుకోబోతున్నట్లు మార్పు తప్పదు వంటి కొటేషన్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి హింట్స్ ఇస్తూ వచ్చింది.