Sonal chauhan : బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ చిత్రంతో కథానాయకగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సోనాల్ చౌహాన్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. లెజెండ్ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి వరుస మూవీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ అమ్మడికి అందం అభినయం నటన వంటివి అన్నీ ఉన్న.. కథల ఎంపికలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో సినీ జీవితంలో ఆమె ప్లాప్ లను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమా హిట్ ని కూడా సొంతం చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అలాగే ఈ మథ్య సోనాల్ టాలీవుడ్ పై కాకుండా బాలీవుడ్ పై దృష్టి సారించింది.
దీంతో ఇటు బాలీవుడ్ లోనూ స్థిరంగా లేక అటు టాలీవుడ్ లోనూ నిలకడగలేక సినీ కెరియర్లో ఫెయిల్యూర్స్ ని చవిచూస్తుంది. ఈ బ్యూటీ సినిమా ఆఫర్ల కోసం తాజాగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో బోల్డ్ ఫోటో షూట్ లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. సెగులు పుట్టించే ఫోటో ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా మెరిసే డ్రెస్సులో సోనాల్ అందాలను వడ్డించింది. ఘాటు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.