Sreeleela : శ్రీ లీల తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు… అందంతో కుర్రాళ్లను పడేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో ప్రస్తుతం దూసుకెళ్తుంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆమెకు మాత్రం తెలుగు ఆడియోస్ లో మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి. ఇటీవలే మాస్ మహారాజా ధమాకా చిత్రంలో కూడా ఈమె మెరిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీ గా గడుపుతుంది. ఈమె ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ పెరిగిందంటే.. ఆమె చేతిలో 7 సినిమాలు ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.
అదే విధంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఉంటుంది. ఫోటో షూట్ ల ద్వారా తీరిక దొరికినప్పుడల్లా అందాలు అరబోస్తూ వార్తలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో లేత అందాలను చూపెడుతూ రెచ్చిపోయింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీ ధమాకా సినిమాకు 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. కానీ తాజాగా ఆమెకు వరుస అవకాశాలు రావడంతో.. ఆమె రెమ్యునరేషన్ ని కోటికి పెంచినట్లు తెలుస్తుంది. స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్, రామ్ చరణ్ వాళ్ల చిత్రాల్లో కూడా ఈమె మెరువబోతుంది.