Sri Reddy : నాటుకోడి వండితే.. నుల‌క మంచం తెగిపోవ‌ల్సిందేనంటున్న శ్రీరెడ్డి..!

Bharath Cine Desk

Sri Reddy : శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినా శ్రీ రెడ్డి నిత్యం ఏదో విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకీయాలు క్యాస్టింగ్ కౌచ్ ఇలా ఒక్కటేంటి అన్నిట్లోనూ దూరి శ్రీ రెడ్డి వివాదాలో చిక్కుకుంటుంది. టాపిక్ ఏదైనా తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా వ్యక్తం చేస్తుంది శ్రీ రెడ్డి. ముఖ్యంగా ఈ నటికి సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం.. ఈ మేరకు సీఎం జగన్ ని ఎవరైనా విమర్శిస్తే శ్రీరెడ్డి అస్సలు ఊరుకోదు. పరుష పదజాలంతో వారిపై విరుచుకు పడుతుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులను చీల్చి చెండాడుతూ ఉంటుంది. ఈమె నటిగా పాపులర్ అయిన దానికన్నా.. వివాదాల ద్వారా ఎక్కువ ఫేమస్ అయింది.

ఈమె తరుచు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవలే విడుదలైన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా పై కూడా ఘాటుగా స్పందించింది. నువ్వు ఇటు సినిమాలు అటు రాజకీయాలకు పనికిరావు.. నీ సినిమాను సెకండ్ డే వీక్షించే వాళ్ళే కరువయ్యారు. భీమ్లా నాయక్ సినిమా చెత్తగా ఉంది. నువ్వు రాజకీయ లబ్ధి కోసమే ఈ సినిమాను తీశావు. సినిమా కోసం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంక‌ ఎందుకు నాకావు? నీ వ్యక్తిగత లాభం కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ ని కలవచ్చు కానీ నీ అన్న చిరంజీవి జగన్ నీ మాత్రం కలవకూడదా ? నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా సీఎం కాలేవు.. అంటూ పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి విరుచుకుపడింది.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీ రెడ్డి కి సంబంధించిన ఒక వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మధ్య శ్రీ రెడ్డి పీతలు, రొయ్యలు, ఎండుచేపలు వంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంది.. ఇటీవలే చెరువులో పట్టిన బంగారుతీగ చేప పులుసు చేసింది. ఆ తరువాత మేక తొడ కూర వండింది. అనంతరం గుమగుమలాడే నాటు కూర వండుతూ… పిక్కలు చూపించింది. కోడిగుడ్ల పులుసు కూడా చేసింది. తాజాగా ఆమె నాటుకోడి పులుసు వండింది. ప్రస్తుతం ఆ విడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. శ్రీ రెడ్డి ఇచ్చే న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూలే కాకుండా ఈ మధ్య తన యూట్యూబ్ వీడియోస్ కూడా ట్రెండింగ్ గా మారుతున్నాయి.

- Advertisement -