Taapsee : తాప్సీ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు… తెలుగు లోకి ఝుమ్మంది నాదం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ… తొలి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఆ తర్వాత తెలుగులో ఆమె బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేసి ఇండస్ట్రీలో రాణించింది. అయితే తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తమిళంలో కూడా అవకాశాలు రావడంతో ఆ సినిమాలో కూడా నటించింది.
ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపింది ఈ ముద్దుగుమ్మ… ఆ తర్వాత బాలీవుడ్ పై ఈ భామ కన్నేసింది.
ఆ ఇండస్ట్రీలో కూడా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది తాప్సి… ముఖ్యంగా హిందీలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు కలిగిన చిత్రంలో తాప్సీ మెరిసింది.
దీనితో కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ జాబితాలో తాప్సీ చేరిపోయింది. అయితే తాప్సీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో ఈ బ్యూటీ ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. తాప్సీ బాలీవుడ్ లోకి చెక్కేసిన తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవి చేయలేదు.
ఆమెకు తెలుగులో నటించే అవకాశాలు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత తాప్సీ నటించిన తెలుగు మూవీ మిషన్ ఇంపాజిబుల్ ఇటివలే విడుదలైంది.
వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న తాప్సి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతూ ఉంటుంది.
ఈ మేరకు తాజాగా లో- దుస్తుల్లో కెమెరా కి ఇచ్చిన ఫోజుల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెట్టింట్లో వైరల్ గా మారాయి