Tamannaah : మిల్కీబ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటిన.. సినిమాల జోరు అస్సలు తగ్గడం లేదు. తెలుగుతోపాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కూడా నటిస్తూ దూసుకెళ్తుంది. మిల్కీ బ్యూటీ అంటే కుర్రకారులకు మొదట గుర్తుకు వచ్చేది.. తమన్నానే ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తున్న ప్రేక్షకుల మనసులో తమన్నా స్థానం ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ కి చిరంజీవి జోడిగా బోళా శంకర చిత్రంలో తమన్నా నటించబోతుంది. ఈరోజు ఆ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న త‌మ‌న్నా.. ఎల్లో క‌ల‌ర్ శారీలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిమ్మపండు రంగు చీరలో నిగనిగలాడుతున్న మిల్కీ బ్యూటీ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మిల్కీబ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ మేరకు తాజాగా అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా తమన్నా కి ఇది రెండో చిత్రం.. అప్పట్లో సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా ఎంతో అద్భుతంగా నటించడంతో.. మళ్లీ చిరంజీవి కి జోడి గా తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తిసురేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఆమె నటించిన సిటీమార్ చిత్రం ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయ్యి బిగ్ హిట్ కొట్టింది. అదేవిధంగా నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్ మాస్ట్రో చిత్రంలో టబు చేసిన నెగిటివ్ రోల్ లో తమన్నా అద్భుత ప్రతిభ కనబరిచింది.

కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా వస్తున్న గుర్తుందా శీతాకాలం’ సినిమాలో తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి సమంత నటించబోతుంది.