Varsha : జబర్దస్త్ షో తో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జంట ఇమాన్యుల్,వర్ష వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ సుధీర్ జోడి ఎంత ప్రత్యేకమో.. అదేవిధంగా వర్ష, ఇమాన్యుల్ జోడి కూడా అంతా ప్రత్యేకమై పోయింది.రోజురోజుకీ ఈ జోడీ విశేష ప్రేక్షక ఆదరణ దక్కించుకుంటుంది. ఈమధ్య వీరిద్దరిపై మల్లెమాల కొన్ని ఈవెంట్లు కూడా చేయడం మొదలు పెట్టింది. అయితే గత కొద్ది వారాల నుండి వర్ష గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్,నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో వర్ష ఇమాన్యుల్ తో జబర్దస్త్ స్కిట్ లు చేయడం కూడా తక్కువ చేసింది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో హాట్ ఫోటోలు నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే గతంలో ఇన్స్టాగ్రామ్ లో వర్ష ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తన బ్రదర్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరడంతో వర్ష ఎమోషనల్ అయింది. తన బ్రదర్ కి ఇలా యాక్సిడెంట్ జరగడానికి ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కారణమని ఆమె చెప్పారు. ఆ ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యం వల్ల నేను మా కుటుంబం ఎంతో బాధ పడ్డాం అని వర్ష చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మన భారతదేశంలోనే రోజుకి వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో సగానికి సగం ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయని మనం రోజు టీవీలో న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. కొంతమంది త్వరగా వెళ్లాలనే తాపత్రయంతో అతివేగంతో డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం వాహనదారులకు ఎంత అవగాహన కల్పించిన వాళ్ల ధోరణి మారడం లేదు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా సూచనలు చేస్తున్నా.. పెడచెవిన పెడుతున్నారు. వర్ష పోస్టు వల్ల.. ఎవరైనా రియలైజ్ అయ్యి మారుతారో లేదో చూడాలి మరి..!