నిర్మల్ జిల్లా మామాడ మండలం సదర్ మాట్ బ్యారేజి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు రెండు మూడు రోజుల్లోనే రూ.40 కోట్ల నష్ట పరిహారం డబ్బులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర అటవీ ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు… నిర్మల్ పట్టణంలో ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిహారం డబ్బుల పై బాధిత రైతులకు తానిచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు..సీఎం కేసీఆర్ ,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావులు నిధుల మంజూరుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.. నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న 27 వ ప్యాకేజి హై లెవల్ కాలువల పనులను రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.. గతంలో పనిచేసిన కాంట్రాక్టర్ ను తప్పించి కొత్త వారికి పనులను అప్పగించామన్నారు. హై లెవల్ కాలువ కు సంబంధించిన నష్టపరిహారం డబ్బులను కూడా త్వరలో మంజూరవుతాయని తెలిపారు.

రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తాం

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు రైతుబంధు పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నందున దిగుబడులు పెరిగాయని తెలిపారు ఈసారి రబీ లో ఒక 1.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు ఏటా దిగుబడులు పెరిగిపోతున్న రాష్ట్రం వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ను మించిపోతుందని వెల్లడించారు ధాన్యం వెదజల్లే పద్ధతి పై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు వరికి ప్రత్యామ్నాయంగా
ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రాధాన్యతనిస్తూ ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. కొద్ది రోజుల్లోనే నిర్మల్ మెడికల్ హబ్ గా మార బోతుందని తెలిపారు కరోనా సంక్షోభం నుంచి జిల్లా గట్టెక్కిందని వైద్య ఆరోగ్య శాఖ దీనిపై మరిన్ని చర్యలు తీసుకోబోతుందని చెప్పారు.. కొద్దిరోజుల్లోనే కలెక్టర్ భవన నిర్మాణం పూర్తి కాబోతుందని. జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు అంబేద్కర్ భవన నిర్మాణానికి మరో కోటిన్నర, ఆర్టీవో ఆఫీస్ భవన నిర్మాణానికి మూడున్నర కోట్లు మంజూరు కానున్నాయన్నారు నిర్మల్ లో రూ. 42 కోట్లతో తాగునీటి పథకానికి సంబంధించిన పనులు చేపట్టినట్టు తెలిపారు చెరువు భూముల ఆక్రమణలపై ఇప్పటికే కలెక్టర్ సీరియస్ గా చర్యలు చేపట్టారని తెలిపారు.

చెరువు భూములను ఆక్రమించుకుంటే చర్యలు తప్పవన్నారు కొంతమంది రాజకీయ స్వ ప్రయోజనాల కోసం తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు.

అవాస్తవ ఆరోపణలు చేయవద్దని మంత్రి హితవుపలికారు. తనది 35 ఏళ్ల రాజకీయ జీవితమని , ఈ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు చూశామన్నారు.. ఏనాడు తనపై చిన్న ఆరోపణ కూడా రుజువు కాలేదన్నారు.. శిఖం భూములు అక్రమించుకున్నారని, డీ1 పట్టాలు ఉన్నాయని కొందరు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నూతన కలెక్టర్ చుట్టు పక్కల నాకు 150 ఎకరాల భూమి ఉందనడం అవాస్తవమని ,గుంట భూమి కూడా తనకు అక్కడ లేదన్నారు… ఇప్పటికే భూముల విషయమై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిర్మల్ ప్రజలకు అన్ని విషయాలు తెలుసని అని వారంతా అభివృద్ధి సంక్షేమ పనులకే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 28, 2021 at 11:27 ఉద.