NARAYANA: కోర్ట్ తో తిట్టించుకోవడం జగన్ కు సరదానా!

Arjun

NARAYANA:ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అప్పుడప్పుడు హై కోర్ట్ తో తిట్టించుకోటం చాలా సరదా ఉంటుంది. అలా తిట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం ఏ పని కూడా చెయ్యలేదు. ఇప్పటికే చాలసార్లు కోర్ట్ తో తిట్టించుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా టెన్త్ ఎక్సమ్ పేపర్ లీకేజీ విషయంలో మళ్ళీ మొట్టికాయలు వేయించుకుంది.

Again jagan was scolded by court in the issue of narayana

పేపర్ లీకేజీ విషయంలో మాజీ మినిస్టర్ నారాయణను అధికారులు అరెస్ట్ చేసి, అయనపై పెట్టిన కేసులను చూసి జడ్జ్ షాక్ అయ్యారంటా. నారాయణపై అధికారులు చెప్తున్నా విషయాలకు, ఆయనపై పెట్టిన సెక్షన్స్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్ట్ వెల్లడించింది.

అధికార దుర్వినియోగం

అధికారాన్ని దుర్వినియోగం చెయ్యడం అధికారంలో ఉన్న పార్టీలకు సర్వసాధారణం. వైసీపీ నాయకులు కూడా తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. నారాయణ అరెస్టు వ్యవహారానికి వస్తే, పోలీస్ ఉన్నతాధికారి ఒకరు, పక్కా ఆధారాలతో అరెస్టు చేశామని చెప్పారు. ప్రభుత్వ పెద్దలైతే, పదేళ్ళు జైలు శిక్ష తప్పదంటూ ప్రగల్భాలు పలికారు.కానీ నారాయణకు బెయిల్ వచ్చేసింది. ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే టీడీపీ ఏపీలో మట్టిలో కలిసిపోయింది. ఈ విషయాలన్నీ తెలిసి కేసుల వైసీపీ నాయకులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.

నారాయణకు పబ్లిసిటీ

ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీకి ఒక్క పైసా కూడా లాభం కలగకపోగా, నారాయణకు ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చారు. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో నారాయణ పేరు అస్సలు వినిపించలేదు. అలంటి సందర్భంలో వైసీపీ నారాయణను మళ్ళీ ప్రజల్లోకితీసుకెళ్లింది. వైసీపీ నాయాకులు టీడీపీని ఇబ్బందుల్లో పెట్టాలని, తామే ప్రతిసారి గోతిలో పడుతున్నారు. టీడీపీని ఇరికిద్దామని అనుకున్న ప్రతిసారి కోర్ట్ చేతుల్లో వైసీపీ మొట్టికాయలు తింటుంది. కుక్క తోక వంకర అన్నట్టు వైసీపీ నాయకులకు ఇప్పట్లో బుద్ధి వచ్చేలా లేదు.

- Advertisement -