Andhra Pradesh: ప్రముఖ నటుడు, జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ తాజాగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సభలో వైసీపీ సర్కార్ నేతలపై విమర్శలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఖండిస్తూ వాళ్ళు కూడా తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మాట్లాడుతూ.. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను అంటున్నారు.. మీరు కూడా చేసుకోండి కొడ‌క‌ల్లారా.. అంటూ ఫైర్ అయ్యారు. ఇక ఆ తర్వాత భరణాలు ఇవ్వండి.. విడాకులు ఇచ్చిన తర్వాతే నేను మూడో పెళ్లి చేసుకున్నాను.. ఒకే పెళ్లి చేసుకుని ముప్పై మంది తో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు.. అంటూ విమర్శించారు.

అంతే కాకుండా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో చెప్పులు చూపిస్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఫైర్ అయ్యింది. ఇదిలా ఉంటే పవన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఓ సభలో.. సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ…. కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన‌ బూతులు మాట్లాడుతున్నారు..

అందరికీ మేలు జరుగుతుందని చెబితే మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు.. నాలుగైదు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకోవ‌డం మొద‌లు పెడితే వ్యవస్థ ఏం బతుకుతుంది.. అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ళ మాన‌ ప్రాణాలు ఏం కావాలి.. ఒకసారి ఆలోచన చేయండి..

Andhra Pradesh:  పవన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్..

అంటూ పవన్ కళ్యాణ్ కు కౌంట‌ర్ ఇచ్చారు. ఇప్పటికే పవన్ స్పీచ్ పై పేర్ని నాని, ఎమ్మెల్యే రోజా, కొడాలి నాని కూడా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా పవన్ కూడా వాళ్ళ వ్యాఖ్యల పై స్పందించాడు. ఇక సీఎం జగన్ పై పవన్ ఎలాంటి స్పందన ఇస్తాడో చూడాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on అక్టోబర్ 20, 2022 at 5:10 సా.