AP ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు తీరాయా.. లేక కొత్త సమస్యలు మొదలయ్యాయా. ఏపీ ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి ఒప్పందం రావడానికి టీచర్‌ షౌండరేషన్‌కు నచ్చలేదా.. ఏపీ టీచర్స్‌ ఫౌండరేషన్ ఎందుకు అసంతృప్తితో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మధ్య రహస్య ఒప్పందం ఏర్పడిందని భావిస్తున్నారా.. లేఖ ఉద్యోగులను ప్రభుత్వం బయపెట్టి చర్చలకు ఒప్పించిందని అనుకుంకుంటుంన్నారా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైందని తెలుస్తోంది. మత్రుల కమిటీతో చర్చలు జరిపిన ఉద్యోగులు తమ స్వలాభం కోసమే చూసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయులను పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. దీంతో వారు జరిపిన చర్చలకు తమకు ఎలాంటి సంభందం లేదని ఉపాధ్యాయులు అన్నట్లు సమాచారం.

పీఆర్సీని సాధించుకోవడానికి ఏర్పడ్డ పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వెనక్కు తీసుకోకుండానే చర్చలకు ఏ విధంగా వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ నేతలతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ఉపాధ్యాయులు చెవులు కోరుక్కుంటున్నట్లు తెలుస్తోంది. పైగా ప్రభుత్వం పీఆర్సీపై అశుతోశ్ మిశ్రా కమిటీ నివేదికను కూడా బహిర్గతం చేయలేదని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పీఆర్సీ సాధన సమితి ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమానికి వచ్చారని, ఆ ఉద్యోగుల ఐక్యత, త్యాగాన్ని పీఆర్సీ సాధన కమిటి వృధా చేసిందని ఉపాధ్యాయులు ఆవేధన వ్యక్తం చేశారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 13, 2022 at 2:08 సా.