AP:రాజకీయ నాయకులంటే ఆదర్శంగా, ముందుండి నడిపించే వారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడున్న నాయకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారంటే ఎవ్వరూ ఊహించలేరు. ఏపీలో ఉన్న రాజకీయ నాయకులంత పనికిమాలిన దరిద్రపు నాయకులు ఇంకెక్కడా ఉండరు.

ఎందుకంటే వాళ్లకు యూట్యూబ్, సోషల్ మీడియా సోకు ఎక్కువైంది అందుకే మీడియా ముందుకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంత ఎక్కువ బూతులు తిడితే అంత ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవ్వొచ్చన్న విషయాన్నీ తెల్సుకున్న టీడీపీ, వైసీపీ నాయకులు ఇష్టమొచ్చిన్నట్టు మాట్లాడుతున్నారు.
వైసీపీ నాయకులకు బుద్దుందా!!
2019 ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు పడ్డారు. ఓపిగ్గా ఉంటూ, ప్రజల మద్దతు కూడా గట్టుకొని అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించారు. అయితే విజయం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్లో సహనం సచ్చిపోయి, ఇష్టమొచ్చినట్టు అధికార పొగరుతో మాట్లాడుతున్నారు. మంత్రిగా పదోన్నతి పొందిన రోజా ఒక మహిళా అయ్యిండి కూడా మహిళలను కించపరిచేలా చేతకాని టీడీపీ నాయకులకు చీరలు పంపిస్తా అంటూ మాట్లాడుతుంది. ఆమె మాటలకు కౌంటర్ టీడీపీ నాయకుడు ఆనం వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ రోజాకు కట్ డ్రాయర్లు పంపిస్తానని మాట్లాడుతున్నారు. ఇలాంటి పనికిమాలిన వెదవలు మన పాలకులు, వాళ్ళు మనల్ని పథంలో నడిపిస్తారు.
అత్యాచారాలకు మహిళలే కారణం
ఏపీలో గత కొన్ని రోజులుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడుతున్న వైసిపీ నాయకులూ అత్యాచారాలు జరగడానికి కూడా అమ్మాయిల తల్లులే కారణమని, వాళ్ళు పిల్లలను వదిలేసి బయటకు వెళ్లడం వల్లే పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళా హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేసే అధికారులు, నాయకులు మనల్ని పాలిస్తున్నారు. వీళ్ళు ఇంత నీచంగా ప్రవర్తించినా కూడా మనం మళ్ళీ ఇలాంటి లీడర్స్ కే ఓటు వేస్తాం, వాఅల్లనే గెలిపిస్తాం. ఓటు వేసే మనకు, పాలించే వాళ్లకు బుద్ది లేదు.