Ap Politics: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అధికార పార్టీ చేసే మోసాల గురించి ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా విశాఖలో జరిగిన టీడీపీ జోన్ వన్ ప్రాంతీయ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సదస్సులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత మొదలైందని , వైసీపీ అధికారంలోకి రావడానికి కుట్రలు పఎన్ని వ్యతిరేక ఓటర్లను తొలగించడంతో పాటు దొంగ ఓటర్లను చేరుస్తున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు హెచ్చరించాడు. ఉత్తరాంధ్రలో టీడీపీ బలోపేతానికి.. వచ్చే ఎన్నికల్లో మరింత పుంజుకోవడానికి చేయాల్సిన అంశాలపై నాయకులకు,కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇక అభివృద్ధి పేరుతో అధికార పార్టీ ప్రజల సొమ్మును దోచుకుంటుందని, విశాఖపట్నాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు . అభివృద్ధి పేరిట అధికార పార్టీ దోచుకున్న ఆస్తులను టీడీపీ అధికారంలోకి రాగానే సిట్ వేసి ఎవరి ఆస్తులు వాళ్లకు అప్ప చెబుతామని ఆయన తెలిపారు. వైసిపి నాయకుడు వైఎస్ అనీల్ రెడ్డి విశాఖలో చేస్తోన్న భూదందాలలో ఎవరి వాటా ఎంతో తేలాలని, రుషి కొండకు గుండు కొట్టిచ్చి బోడికొండను చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రాగానే దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తుందని.. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని చంద్రబాబు హెచ్చరించాడు.
Ap Politics: వైసీపీకి టైం దగ్గర పడింది…
అలాగే వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించడానికి టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చాడు. అంతేకాకుండా పార్టీలో ఉన్న అందరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, టీడీపీలో గ్రూపులు కడితే ఎవరికీ పదవులు రావని పార్టీ నేతలకు చురకల వేశారు . టీడీపీ గెలుపు కోసం పాటు పడిన వారికే ప్రాధాన్యం ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అధికార పార్టీకి టైం దగ్గర పడిందని వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా టిడిపి పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు భీమా వ్యక్తం చేశాడు.