KCR: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలని కేసీఆర్, తెలంగాణాలో కేసీఆర్ ను ఓడించాలని బీజేపీ నాయకులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీలో ఉన్న నేతలను బీఆర్ఎస్ వాళ్ళు , బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళను బీజేపీ వాళ్ళు తమ పార్టీలోకి రావాలని నేతలకు ఆశలు చూపిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలను తెలంగాణలో బీజేపీలోకి తీసుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారు, కానీ కేసీఆర్ ఇచ్చిన షాక్ కు ఆ బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ నేతలను కొనాలనే ఆలోచనే చెయ్యడానికి బీజేపీ నేతలు భయపడుతున్నారు. కానీ బీఆర్ఎస్ లో చేరడానికి మాత్రం బీజేపీలోని చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. జాతీయ పార్టీగా మారిన తరువాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఏపీలో చాలామంది నేతలు బీఆర్ఎస్ లోకి వచ్చారు. చాలామంది జనసేన నేతలు బీఆర్ఎస్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఒడిశాలోని బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మాజీ సీఎం బీఆర్ఎస్ లోకి
మొన్నటి వరకు ఏపీలో వేగంగా వేరే పార్టీ నేతలను చేర్చుకున్న కేసీఆర్, ఇప్పుడు ఒడిశాలో కూడా పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ సీనియర్ నేతలు కూడా బీఆర్ఎస్ లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. 1999లో ఒడిశా ముఖ్యమంత్రిగా పని చేశారు. కోరాపుట్ లోక్ సభ నుంచి తొమ్మిదిసార్లు విజయం సాధించారు. ఒడిశా రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. ఇప్పటికే గిరిధర్ పార్టీకి రాజీనామా చేస్తూ, లేఖను నడ్డాకు పంపారని సమాచారం. ల్లుండి హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువాను కప్పుకోనున్నారు. 2015లో ఆయన బీజేపీలో చేరారు. గమాంగ్ తో పాటు లోక్ సభ మాజీ సభ్యుడు జయరాం పంగీ కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారు.
ఈ స్పీడ్ ఏంటి కేసీఆర్!!
బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే వేగంగా వేరే రాష్ట్రాల్లో విస్తరిస్తుంది. మొన్నటి వరకు ఏపీలో వేగంగా చేరికలను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది. జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితరులు.. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకొన్నారు. బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరించడానికి పార్టీ నాయకులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఏపీలో మాదిరి ఇప్పుడు ఒడిశాలో కూడా పార్టీని విస్తరించడానికి కేసీఆర్ చేసిన వ్యూహాలు ఫలించేలా ఉన్నాయ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ షాక్ ఇచ్చేలా ఉన్నారు.