Atchannaidu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు రాజకీయాల వర్గాల మధ్య మాటల యుద్ధం బాగా నడుస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ పై మాత్రం బాగా విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులపాలలో ముంచాడని కేంద్ర ప్రభుత్వం బాగా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇదే ఆసరా తీసుకొని వైఎస్సార్ పార్టీపై బాగా విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు.
తాజాగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద – ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్ పార్టీల తరఫునుండి పలువురు నేతలు హాజరయ్యారు. అంతేకాకుండా తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా హాజరై వైకాపా ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యాడు.
అక్కడి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దోపిడి చేస్తున్నప్పుడు ప్రశ్నించడం మన హక్కు అని అన్నాడు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తుంటే వెంటనే పోలీసులు వచ్చి అర్ధరాత్రి అయినా సరే అరెస్టు చేస్తున్నారు అని అన్నాడు. కేసులు పెట్టిన, జైళ్ళకు వెళ్లిన మేము మాత్రం ప్రజా సంక్షేమం కోసమే పోరాడుతున్నాము అని అన్నాడు.
Atchannaidu
ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత చాలా ఉంది అని అన్నాడు. ప్రజా వేదిక కూల్చివేతలో ప్రారంభమైన వైఎస్సార్ పార్టీ విధ్వంసం ఇప్పటం గ్రామం వరకి సాగిందని అన్నాడు. ఒక అవకాశం కోరితే వైఎస్ఆర్ పార్టీ ప్రజలు అవకాశం ఇచ్చారని.. దీంతో ముఖ్యమంత్రి అయిన జగన్ వ్యవస్థలన్నింటిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడని అన్నాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపదను ముఖ్యమంత్రి జగన్ దోచుకుంటున్నాడని ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన మాట్లాడిన తీరుతో వైకాపా నాయకులు మండిపడుతున్నారు.