YCP: ప్రభుత్వ ఉద్యోగులంత నిర్లక్ష్యంగా ఎవ్వరూ పని చెయ్యరని, వాళ్ళు అసలు టైమింగ్స్ పాటించారని, కేవలం లంచ్ టైమింగ్ ను మాత్రం పక్కాగా పాటిస్తారని మనకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు వైసీపీ ఇలాంటి పనికిమాలిన గవర్నమెంట్ ఉద్యోగులకు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అటెండెన్స్ బై ఫొటోగ్రఫీ విధానాన్ని ప్రవేశపెడుతూ జీవో నెంబర్ 159ను పెట్టింది. ఈ విధానాన్ని జనవరి 1 నుండి రాష్ట్రంలో అమలు చేయనున్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. తమను ఇబ్బందులకు గురి చెయ్యడానికే ప్రభుత్వం ఇలా ప్రయత్నాలు చేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల ప్రభుత్వ సంస్థలు మెరుగ్గా పనిచేస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఈ విధానాన్ని మొదట స్కూల్ లో కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది కానీ అములు చెయ్యలేపోతోంది.

ఎలా అమలు చేస్తుంది
రెండు విడతల్లో ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనుంది జగన్ సర్కార్. తొలి విడతలో జనవరి 1వ తేదీన సచివాలయం పరిధిలో ఈ ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ను ఉద్యోగుల కోసం అందుబాటులోకి తీసుకుని రానుంది. రెండో విడతలో భాగంగా జనవరి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన విభాగాధిపతులు, అటానమస్ ఆర్గనైజేషన్స్, అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకుని రానుంది. ఈ విధానం దేశంలో ఎక్కడా అమలులో లేదని వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. ఇలా మొత్తంగా మాత్రం దేశంలో ఎక్కడా లేదు. ఇలా చెయ్యడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సచ్చినట్టు సమయపాలన పాటిస్తారని అధికారులు చెప్తున్నారు. వారి పనిలో కూడా నాణ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయ్.
ఎందుకు అమలు చేస్తుంది??
సడన్ గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా లేదా ఎప్పటి నుండో ప్లాన్ చేస్తూ ఇప్పుడు అమలు చేస్తుందా అన్న విషయాన్నీ పక్కన పెడితే ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే విషయంపై ఈ జీవో నంబర్ 159లో పొందు పరిచింది ప్రభుత్వం. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా, నిర్దుష్ట సమయానికి సరైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని అమలు చేయాల్సి వచ్చిందని వివరించింది. గ్రామస్థాయిలో పరిపాలన సజావుగా సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఉద్యోగులందరూ సమయపాలనను పాటించేలా చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని వచ్చే రోజుల్లో స్కూల్స్ లో కూడా ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తె విద్యలో కూడా నాణ్యత ప్ పెరిగే అవకాశం ఉంది.