Bandi Sanjay: కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో చిక్కుకునేలా ఉంది, ఆమెపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడవచ్చని బీజేపీ నాయకులు అనుకున్నారు కానీ బండి సంజయ్ చేసిన పనికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కనీసం ఆ విషయం గురించి మాట్లాడలేకపోతున్నారు. పబ్లిక్ ఎలా మాట్లాడాలో కూడా తెలియని బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటేనే ఆ పార్టీలో మహిళలకు ఎ ఎలాంటి పాత్ర, ప్రాముఖ్యత ఉంటుందో అర్థమైతుంది.బండి సంజయ్ చేసింది తప్పని రాష్ట్రం మొత్తం అంటున్నారు పైగా సొంత పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు కానీ బండి సంజయ్ మాత్రం తానూ చేసింది తప్పని, అలా మాట్లాడటం తప్పని మాత్రం చెప్పడం లేదు. మహిళల పట్ల ఇంత చులకన భావం ఉన్న బండి సంజయ్ తనను వచ్చే ఎన్నికల్లో గెలిపించి సీఎంను చెయ్యాలని ప్రజలను అడుగుతున్నాడు.
మహిళా కమిషన్ కు షాక్
MLC కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ కూడా తప్పుపట్టింది కానీ బండి సంజయ్ లో మాత్రం ఇంతా కూడా తప్పు చేశానన్న భావం కనిపించడం లేదు. ఈ వ్యాఖ్యల విషయంలోనే తమ ముందు విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కానీ బండి సంజయ్ ఇక్కడ కూడా తన పొగరును, మహిళల పట్ల ఉన్న తక్కువ చూపు తనాన్ని నిరూపించుకుంటూ, తనకు సమయం ఉన్నప్పుడు హాజరవుతానని చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయినా ఇన్ని రోజులు ఇక్కడే ఖాళీగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు తనకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని, అవన్నీ అయిపోయిన తరువాత 18న తనకు సమయం ఉన్నప్పుడు లేదా ఇంటరెస్ట్ ఉన్నప్పుడు వచ్చి అటెండ్ అవుతానని బండి సమాధానం ఇచ్చారు.
బీజేపీ వాళ్ళే తిట్టిన బుద్ధి రాదా!!
కవిత విషయంలో బండి సంజయ్ వ్యాఖ్యలను చాలామంది తప్పుపడుతున్నారు. అయినా కూడా బండి సంజయ్ లో మార్పు రావడం లేదు. పైగా సొంత పార్టీవాళ్ళు తిట్టినా కూడా బండి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇలా మహిళలపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ మహిళా బిల్లు మీద కవితకు సలహాలు ఇస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ స్కాం ను డైవర్ట్ చెయ్యాలని బీఆర్ఎస్ నాయకులు ఈ బండి సంజయ్ వ్యాఖ్యలను హైలైట్ చేస్తున్నారు. ఈ పనికిమాలిన బండి సంజయ్ కు ఇది అర్థం కాక అహానికి పొయ్యి ఇష్యూను తనమీదికి తెచ్చుకుంటున్నారు.