BJP: తమిళ నటి గాయత్రీ రఘురాం బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆమెను గత ఏడాది నవంబర్‌లో బీజేపీ సస్పెండ్ చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆమెను ఆరు నెలల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటినుంచి పార్టీతో సంబంధం లేకుండా ఉంటున్న ఆమె తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఆరు నెలల్లో సస్పెండ్ గడువు ముగియనుండగా.. ఈ లోపే ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. పార్టీలో మహిళలకు రక్షణ లేదని, అలాంటి చోట తాను ఉండనని తెలుపుతూ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. భారమైన తన హృదయంతో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నానని, అన్నమలై సారథ్యంలో మహిళలకు రక్షణ లేదని ఆమె ఆరోపించారు. సమానత్వం లేదని, ప్రాధాన్యత లేదని అన్నారు.
BJP
పార్టీలో ప్రధాన్యత దక్కకపోవడంతోనే.. బయట నుంచి ట్రోల్ చేయడం మంచిదని అనిపించిందని గాయత్రీ రఘురాం తెలిపారు. హిందూ ధర్మం తన హృదయం అని, ఒక రాజకీయ పార్టీలో దానిని వెతకాల్సిన అవసరం తనకు లేదన్నారు. గుడికి వెళ్లి దేవుడు వద్ద ధర్మం కోసం అన్వేషిస్తానని, దేవుడు ఎక్కడైనా ఉంటాడన్నాడు. న్యాయం ఆలస్యమైతే న్యాయం చేయడానికి నిరాకరించినట్లు అని గాయత్రీ రఘురాం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గాయత్రీ రఘురాం రాజీనామాపై ఇప్పటివరకు బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సస్పెండ్ ఎత్తివేస్తామని, పార్టీకి మద్దతుగా ఉండాలని కోరుతున్నారు. కానీ గాయత్రీ రఘురాం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆమె వేరే వేరే పార్టీలో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.