KCR: దేశంలో బీజేపీని దెబ్బకొట్టడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు ఒకరిని ఒకరు దెబ్బకొట్టుకోవడానికి ఉన్న శ్రద్ధ, ఓపిక ప్రజల గురించి ఆలోచించే దానిలో ఉండదు. ఇష్టమొచ్చినట్టు గొడవలు పడి, ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే రాజకీయమని ఈ రెండు పార్టీల నాయకులు అనుకుంటున్నారు. అందుకే ఖమ్మంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు. దీనికి కారణమేంటో తెలుసా… వందేమాతరం ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ప్రధాని మోడీ ప్రారంభించడమే. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్యలో వారానికి ఆరు రోజులు తిరిగే ట్రైన్ ను ప్రధాని మోడీ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయమై రెండు పార్టీల నేతలు కొట్టుకుంటున్నారు.
ఖమ్మంలో గొడవలు
ఈ ట్రైన్ ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రజల డబ్బుతో తయారు చేసిన ట్రైన్ ను మోడీ ప్రారంభించారు. దీన్ని తయారు చెయ్యడానికి మోడీ కానీ, బీజేపీ ,కెసిఆర్ , బీఆర్ఎస్ ఎవ్వరూ డబ్బును పెట్టలేదు. కానీ వీళ్ళేదో తమ సొంత డబ్బులతో ప్రజలకు ఇచ్చినట్టు ఫీల్ అవుతూ, ఎవరికీ వారు గొప్పని చెప్పుకుంటూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు గొడవలు పడుతూ ఉన్నారు. అలాగే ఖమ్మంలో కూడా ఈ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కిన సందర్భాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ-భారత్ రాష్ట్ర సమితి నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ రెండు పార్టీల నాయకులు ఒకేసారి రైల్వే స్టేషన్ కు చేరుకోవడం, ఎదురెదురు తారసపడటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నినాదాలు- ప్రతి నినాదాలు చేసుకున్నారు. పోటాపోటీ నినాదాలతో రెచ్చిపోయారు.
ట్రైన్ ప్రత్యేకతలు
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య పరుగులు తీసే ఈ ఎక్స్ ప్రెస్ లో మొత్తం 16 బోగీలు ఉన్నాయి. అందులో 14 చైర్ కార్, రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్స్. ఈ రైలు సీటింగ్ కెపాసిటీ 1128. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య వారంలో ఆరు రోజుల పాటు రాకపోకలు సాగిస్తుంది. ఆదివారం ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు. ఈ రైలుకు ఉన్నవన్నీ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్. వాటంతటవే తెరచుకుంటాయి. నిర్దేశిత సమయం పూర్తి కాగానే మళ్లీ మూసుకుంటాయి. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థ మెట్రో రైలులో మాత్రమే అందుబాటులో ఉంది. డోర్ మూసుకోకపోతే అక్కడే ఉన్న గ్రీన్ బటన్ ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రయాణికులకు. అత్యవసర సమయంలో ర్యాక్ తలుపులు తెరచుకోవడానికి రెడ్ బటన్ ను అందుబాటులో ఉంచారు. ఏదైనా ఇబ్బందులు వస్తే- ఆ సమాచారాన్ని ట్రైన్ క్రూనకు తెలియజేయడానికి ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ను ఏర్పాటు చేశారు.