BJP:బీజేపీ ప్రజలపై ఎలాంటి ప్రేమ ఉండదు, చెయ్యాలన్న ఆలోచన కూడా ఉండదు. బీజేపీ నాయకులకు కావలసింది కేవలం అధికారం మాత్రమే. దాని కోసం బీజేపీ ఎలాంటి పాల్పడుతుంది. కులాలను, మతాలను రెచ్చగొట్టడానికి కూడా బీజేపీ సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీజేపీ తన మత రాజకీయాలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు టిఆర్ఎస్ పై కోపాన్ని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై చూపిస్తుంది. రాష్ట్రానికి అప్పుల విషయంలో బీజేపీ రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది. రాష్ట్రానికి అప్పులు రాకుండా కేంద్రం ఆంక్షలు విదిస్తుంది. తమకు మద్దతు ఇస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఇష్టమొచ్చినట్టు అప్పులు తీసుకునే అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఉద్యోగులకు జీతాలొస్తాయా!!
బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై చూపిస్తున్న కక్ష్య వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది. బీజేపీ వాళ్ళ ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కార్ కు రూపాయి కూడా అప్పు పుట్టలేదు. ఇప్పటి వరకూ ఎలాగోలా లాక్కొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి జూన్‌లో తీవ్రమైన కష్టాలు ఎదురు కానున్నాయి. ఇప్పుడు మూడు వేల కోట్ల అప్పు కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ బీజేపీ వల్ల దొరకటం లేదు. అలాగే రైతు బంద్ కోసం కూడా రాష్ట్రానికి డబ్బులు అవసరం ఉంది. మరి కేసీఆర్ ఈ ఇబ్బందిని ఎలా ఎదుర్కుంటాడో వేచి చూడాలి.
ప్రజలపై కోపమా!!
బీజేపీ ఒక పార్టీపై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపిస్తూ ఉంది. ప్రజల కోసం తాము వస్తున్నామని చెప్పుకొనే బీజేపీ ఇప్పుడు ప్రజలనే ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏపీనే పూర్తి రుణ సమాచారం ఇవ్వడం లేదని కాగ్, ఏఏజీ వంటి వ్యవస్థలు లేఖలు రాస్తూ ఉంటాయి. కానీ తెలంగాణ మొత్తం పూర్తి క్లారిటీగా లెక్కలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా రాజకీయ కారణాలతోనే అప్పులకు అనుమతి ఇవ్వకుండా తమను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.