KCR: ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కు మొన్నటి వరకు ఉన్న వ్యూహం ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్. దాన్ని పూర్తిగా వాడేశాడు, ఇంతలా అంటే తెలంగాణ ప్రజలే చాలు బాబు అనేంతగా వాడేశారు. అందుకే లాస్ట్ ఎన్నికల్లో టీడీపీని అడ్డుపెట్టుకొని, మళ్ళీ సెంటిమెంట్ ను వాడుకొని అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కూడా సేమ్ సెంటిమెంట్ ను వాడుకోవడానికి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ వ్యూహాన్ని కొంతమార్చి బీజేపీని అడ్డుపెట్టుకొని గెలవడానికి ప్రశాంత్ కిషోర్ తో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి కేసీఆర్ చాల చెయ్యడానికి ప్రయత్నించారు కానీ అవన్నీ ఫలించకపోవడంతో మళ్ళీ కేసీఆర్ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు. అభివృద్ది గురించి మాట్లాడి, దానితోనే ఎన్నికలకు వెళ్ళే ధైర్యం కెసిఆర్ కు లేదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. అయినా కూడా మళ్ళీ ప్రజలను సెంటిమెంట్ అనే వ్యూహంతో కొట్టడానికి తెరసా నేతలు సిద్ధమయ్యారు. అయితే బిజేపిని విలన్ గా చూపిస్తూ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని వేస్తున్న వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.
బిజేపి విలన్
గత ఎన్నికల్లో టిడిపిని అడ్డుపెట్టుకొని కేసీఆర్ ఆడిన డ్రామాలను తెలంగాణ,ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. టిడిపి ఇక్కడ ప్రధాన పార్టీ కాదు కానీ దాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ను ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొట్టారు. అలాగే ఇప్పుడు కూడా కెసిఆర్ తాను చేసిన అభివృద్ది గురించి చెప్పుకోవడానికి, దానితో ఎన్నికలకు వెళ్ళడానికి ఏమి లేదు కాబట్టి సేమ్ పాత వ్యూహాని వాడి ఎన్నికలు దిగుతున్నారు. అయితే ఇప్పుడు మత పార్టీ అయిన బిజేపిని ఈసారి విలన్ గా చూపిస్తూ ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు . అయితే ఇప్పుడు బిజేపి కూడ రాష్ట్రానికి పెద్దగా చేసిందేమి లేధు. ఆ పార్టీ ని ప్రత్యేకంగా ఎవ్వరూ విలన్ గా చూపించాల్సిన అవసరం లేధు ఎందుకంటే బిజేపి చేస్తున్న రాజకీయలే వాళ్ళను అలా ప్రాజెక్టు చేస్తాయి. అయితే అదే విషయాన్ని కేసీఆర్ వాడుకుంటున్నారు. కేసీఆర్ ఎన్నో మాటలు చెప్తారు కానీ ఇప్పటికీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తారు.
బిజేపి గెలిపిస్తుందా!!
బిజేపిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్తితులో లేరు. బిజేపి ఒక మతపరమైన పార్టీ అనే విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది. కాబట్టి బిజేపిని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేధు. అయితే బిజేపిని అడ్డుపెట్టుకొని ఎన్నికలకు వస్తున్న కెసిఆర్ ను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేధు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పటికే చాలామంది సివిల్ సర్విస్ అధికారులు కేసీఆర్ పాలనపై మండిపడుతూ ఆయన చేస్తున్న తప్పులను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని అడ్డంకుల మధ్య బిజేపి అనే వ్యూహాన్ని నమ్ముకున్న కేసీఆర్ ను ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలి.