BJP:మత రాజకీయాలను దేశంలో నడిపించడంలో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణాలో కులాలను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి సిద్దమైంది. కులాలను వాడుకోకుండా రాజకీయాలు చేస్తున్న పార్టీలు ఒక్కటి కూడా లేదు. అలాగే ఇన్నాళ్లు మతాన్ని మాత్రమే ఉపయోగించుకున్న బీజేపీ, దాని వల్ల తెలంగాణాలో ప్రయోజనం లేదని తెల్సుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు కులాన్నికూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తుందో. ఈ ప్రయత్నంలోనే మున్నూరు కాపు సామజిక వర్గానికి దగ్గరకు కావడానికి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ కు రాజ్యసభ ఇచ్చి ఈ విషయాన్నీ బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
మున్నూరు కాపు వర్గానికి వల
మున్నూరు కాపు ఓట్ల సంఖ్య తెలంగాణాలో చాలా ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణలోని చాల ప్రాంతాల్లో పార్టీల యొక్క విజయాలను, ఓటమిని నిర్ణయిస్తూ ఉంటారు. అయితే ఈ సామజిక వర్గానికి చెందిన ప్రజలు ఇప్పుడు కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఈ సామజిక వర్గాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడానికి బీజేపీ సిద్ధమైంది. అలాగే ఇప్పుడు తెలంగాణ బీజేపీని అన్నీ తామైనడిపిస్తున్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఆ వర్గం వారే. ఇలా కేసీఆర్ ను దెబ్బతియ్యడానికి వస్తున్నా ఏ అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోవడం లేదు. అందుకే ఈ విషయంలో కూడా ముందుగానే ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది.
కేసీఆర్ చూస్తూ ఉంటాడా!!
మున్నూరు కాపు ప్రజలు తనపై కోపంగా ఉన్నారని తెలుసుకోలేన్నంత దద్దమేమి కాదు కేసీఆర్. అందుకే తానూ కూడా ఈ సామాజిక వర్గానికి దగ్గర కావడానికి, అదే వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సీటు ఇచ్చారు. కానీ అది రెండేళ్లే. ఈ విషయాన్ని కూడా బీజేపీ వాడుకుంటూ రెడ్డి, వెలమ వర్గాలకు ఆరేళ్ల కాలం ఇచ్చి బీసీలకు రెండేళ్ల పదవి ఇస్తారా అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ వచ్చినట్లేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా రెండు పార్టీలు మున్నూరు కాపు ప్రజలను ఆకట్టుకోవడానికి చాలా వ్యూహాలు రచిస్తున్నారు. చివరికి మున్నూరు కాపు ప్రజలు ఎవరి వైపు ఉంటారో వేచి చూడాలి.