ప్రస్తుతం కరోనా దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. అన్ని రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిలాగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే కరోనా సోకిన వారు ఆసుపత్రి ఖర్చులు భరించలేకపోతున్న పరిస్థితిలో జగన్ సర్కార్ కరోనాను ఆరోగ్య శ్రీలోకి తీసుకువచ్చి ప్రజలకు ఎంతో ఊరట కలిగించిన విషయం తెలిసిందే. అయితే కరోనా బారిన పడ్డ వారికి బ్లాక్ ఫంగస్ అనే కొత్త రోగం ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై మంత్రి ఆళ్లనాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ…కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మరింత పకడ్బంధీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం

బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించాదన్నారు. పాజిటివ్ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత పకడ్బంధీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని చెప్పారు.కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలేతే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. పదివేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈనెలాఖరు కల్లా 2వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ రాబోతున్నాయని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు వాడే మందులను సమకూర్చాలని సీఎం ఆదేశించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 17, 2021 at 2:48 సా.