Prashanth Kishor: బీజేపీ వ్యతిరేఖ కూటమిని ప్రశాంత్ ఏర్పాటు చేయగలడా!!

Arjun

Prashanth Kishor: భారత రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా వినిపిస్తూ, ప్రభావాన్ని చూపిస్తున్న వారిలో ప్రశాంత్ కిషోర్ ఒకరు. అయన ఒక పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ కావొచ్చు కానీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీకి చెక్ పెట్టె దిశగా అడుగులు వేస్తూ,

can prashanth kishor form a political power to fight with bjp

మిగితా వారిని కూడా తన దిశగా నడిపిస్తున్న వారిలో ప్రశాంత్ కిషోర్ ముఖ్యుడు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను తన స్ట్రాటెజిస్ట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే దిశగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి.

పీకేతో కలిసిన మమత

గత ఎన్నికల్లో ప్రశాంత్ సలహాలతో ఎన్నికలకు వెళ్లిన మమతా మళ్ళీ ప్రశాంత్ తో జతకట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించిన వెంటనే మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు. పార్టీలో కొందరికి పీకేతో పని చెయ్యాలని లేకున్నా కూడా మెజారిటీ అభిప్రాయం మేరకు పీకేతో కలిసి పని చేస్తామని మమతా ప్రకటించారు.

బీజేపీకి చెక్ పెట్టగలడా!!

ఇప్పుడు ప్రశాంత్ తో ఎవరెవరు అయితే కలిసి ఎన్నికలకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వాళ్ళే. ప్రశాంత్ కూడా బీజేపీకి చెక్ పెట్టాలని ఎప్పటి నుండి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరిని ఒకటి చేసి రానున్న బీజేపీకి ప్రశాంత్ చెక్ పెట్టగలరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీని ఓడించటానికి ప్రశాంత్ లాంటి వాళ్ళు అవసరమని చాలామంది భావిస్తున్నారు.

- Advertisement -