CBN: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీడీపీలో కొత్త జోష్ ని నింపాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే సెమి ఫైనల్స్ అని బొత్సా సత్యనారాయణ లాంటి నాయకులు కూడా ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించారు. అలాంటి ఎన్నికల్లో అది కూడా వైసీపీ బలంగా ఉంటుందని అనుకున్న ప్రాంతాల్లో టీడీపీ విజయం సాదించడమనేది టీడీపీ సాధిచిన విజయం. రాయలసీమలో, విశాఖపట్నంలో టీడీపీకి వ్యతిరేకత పెరిగిందని, టీడీపీకి ఇక్కడ ఓటమి తప్పదని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు టీడీపీ విజయంతో వైసీపీలో భయం మొదలైందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఈ విజయాన్ని చూసుకొని టీడీపీ ఇప్పుడు వైసీపీకి సవాల్ విసిరే స్థాయికి వెళ్లారు. ఈ విజయం రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.CBN

జగన్ ఆ మాట అనగలడా!!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని చూసుకొని టీడీపీ నాయకులు అప్పుడే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన్నంత హడావిడి చేస్తున్నారు. ఒక ఎన్నికకు మరో ఎన్నికకు సంబంధం ఉండదని తెలిసినా కూడా టీడీపీ నాయకులు చేస్తునం ఈ హడావిడిని చూస్తుంటే చాలా నవ్వొస్తుంది. ఈ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ను చూసి, టీడీపీ నాయకులు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తామని చెప్తున్నా జగన్, ఈ రిజల్ట్ ను చూసిన తరువాత కూడా చెప్పాలని బాలయ్య జగన్ కు సవాల్ విసిరారు. అయినా ఇక్కడ గెలిచింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఇక్కడ ఓట్ వేసిన వారే మొత్తం ఓటర్లు కాదన్నా విషయాన్నీ తెలుకోవాలి.

కార్యకర్తలకు సెల్యూట్

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనిచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్యూట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని గురించి మాట్లాడుతూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం. మార్పుకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకం” అని అన్నారు. ఈ విజయాన్ని టీడీపీ నాయకులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగిస్తారో లేదో చూడాలి.