Ys Jagan Mohan Reddy: ఇక పవన్- బాబు కలిసి జగన్ కు చుక్కలు చూపిస్తారా !!

Arjun

Ys Jagan Mohan Reddy: 2019 ఎన్నికల్లో చేసిన ఏ తప్పును కూడా జనసేన- టీడీపీ నాయకులు మళ్ళీ చెయ్యదలచుకోలేదు. అప్పుడే ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేసినప్పటికీ ప్రజలకు మాత్రం వీళ్ళు కలిసి పోటీ చేసినట్టుగానే కనిపించింది. అలా కనిపించేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు 2024 రానున్న ఎన్నికల్లో

cbn and pawan kalyan going to give tough fight to ys jagan

ఈ రెండు పార్టీలు కలిసి పోటీకి సిద్ధమైనట్టు ఇరు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉన్నాయ్. మొన్న చంద్రబాబు నాయుడు పొత్తుల గురించి మాట్లాడగా, ఇవ్వాళ పవన్ కళ్యాణ్ కూడా పొత్తుల విషయమై ప్రస్తావిస్తూ మాట్లాడారు.

పొత్తుకు సిద్ధమే

ఇవ్వాళ రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూల్ వెళ్లిన పవన్ మాట్లాడుతూ”ఒంటరిగా రావాలని వైసీపీ నాయకులు సవాళ్లు విసురుతున్నారని, తాము ఎలా ఎన్నికల్లో పోటీ చెయ్యాలో చెప్పడానికి మీరు ఎవరని వైసీపీ నాయకులను పవన్ ప్రశ్నించారు. ” ఒకవేళ చంద్రబాబు నేరుగా వచ్చి పొత్తు విషయమై అడిగితే ఆలోచిస్తామని పవన్ తెలిపారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ఎప్పటి నుండో వస్తున్న వార్తలు రానున్న రోజుల్లో నిజం కానున్నాయి.

జగన్ కు ఓటమి తప్పదా!!

2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఘన విజయం ఇచ్చినప్పటికీ, పాలనలో మాత్రం వైసీపీ నాయకులు మాత్రం విఫలమయ్యారు. ప్రతి రంగంలో ఏపీ వెనకపడుతూనే ఉంది. పైగా 2019 ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండని జగన్ చేసిన అభ్యర్థకు ముగ్ధులైన ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారు. పైగా అప్పుడు టీడీపీ, జనసేన మధ్య నున్న పోరు కూడా వైసీపీకి కలిసి వచ్చింది. చాలచోట్ల టీడీపీ ఓటమికి జనసేన కారణమైంది. అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీకి దిగనున్నాయి. ఇప్పటికే వైసీపీపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరిగింది. ఈ వ్యతిరేకత, అలాగే టీడీపీ-జనసేన పొత్తు వైసీపీకి చుక్కలు చూపించేలా ఉన్నాయ్.

- Advertisement -