Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? కార్యకర్తలను సొంత వాళ్లలా చేసుకోవడం. టీడీపీకి చెందని కార్యకర్తలను తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ గా భావిస్తారు చంద్రబాబు. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు పాటుపడిన కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడమే కాదు.. కార్యకర్తలను ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకే.. ఏ పార్టీకి లేనంతగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది.
అలాంటి కార్యకర్తలను చూసి తాజాగా చంద్రబాబు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయని చంద్రబాబు ఉటంకించారు. ఇటీవల నెల్లూరులో జరిగిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కార్యకర్తలను యాక్టివ్ కావాలని సూచించారు. నిజానికి పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలే. పార్టీ కార్యకర్తలే పట్టుగొమ్మలు. వాళ్లు లేకుంటే పార్టీ లేదు. దాన్ని బలంగా నమ్మిన చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
Chandrababu : కార్యకర్తలను ఉత్సాహపరిచిన చంద్రబాబు
నెల్లూరు సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కార్యకర్తలను ఉత్సాహపరిచి యాక్టివ్ చేశారు చంద్రబాబు. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కార్యకర్తలను ఉత్సాహపరిచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. టీడీపీ పార్టీకి ఏపీలో కార్యకర్తల బలం ఎక్కువ. ఇప్పుడు ఆ కార్యకర్తల బలమే పార్టీకి ప్లస్ కానుంది. దానికి తోడు ఇటీవల టీడీపీ గెలిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు, మరో ఎమ్మెల్యే కోటా సీటుతో మరోసారి ఏపీలో టీడీపీ పాలన రాబోతోంది అనే సంకేతం వినిపించింది.
ఏపీలో 2024 లో చంద్రబాబు శకం మళ్లీ ప్రారంభం కానుంది. ఈ వయసులో కూడా ఏమాత్రం భయపడకుండా.. అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కుర్రాడిలా చంద్రబాబు యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవడం అనేది చిన్న విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు నిద్రహారాలు మాని ఎంతో కృషి చేస్తున్నారు.