నదీజలాల విషయంలో ఏపీ, తెలంగాణల మధ్య జలవివాదాలకు కారకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం స్థానిక జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, అధోగతి పాలు చేసిన వ్యక్తిగా చంద్రబాబు అన్నారు ఆనాడు పాదయాత్రలో ప్రజలు సమస్యలు తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి నవరత్నాలు అమలులో, మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలలో 95శాతం అమలు చేసి సూపర్ సీఎం గా పేరు తెచ్చుకున్నారన్నారు.
ఈ విషయం చంద్రబాబు నాయుడు వారి కుమారుడు నారా లోకేష్ గుర్తెరగాలన్నారు. ఆయన పై లేనిపోని ఆరోపణలు సరికాదన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మాజీ రెవెన్యూ మంత్రి, పస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నేరడి బ్యారేజీ రెండవ దశ కు కృషి చేశారని, నేడు అన్ని ప్రాజెక్టులతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్ని నీటి వనరులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. తమ పార్టీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేరడి బ్యారేజీని సందర్శించారని, రెండో దశను త్వరలోనే పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆద్వర్యంలో తోటపల్లి, బహుదా ప్రాజెక్టులతో పాటు ఆఫ్షోర్ రిజర్వాయర్ ను కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణదాస్ తెలిపారు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయినందున రైతులకు నీటి వనరులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధిని చేద్దామని జగన్మోహన్ రెడ్డి తెలియజేశారన్నారు. ప్రజలకు చేరువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు, తన కుమారుడు లోకేష్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ జగన్మోహన రెడ్డిని విమర్శించే అర్హతలేదన్నారు.

త్వరలో చెరువుల గట్లపై మొక్కలు పెంపకం

వైసీపీపై టీడీపీ చేస్తున్న విమర్శలు ప్రజలు గమనిస్తున్నారని, ఇదివరకే ప్రజలు బుద్ధిచెప్పారని టీడీపీ నాయకులు గుర్తెరగాలన్నారు. టీడీపీ నాయకులు చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ తప్పులన్నారు. మీడియా ప్రతినిధులు కూడా వాస్తవికతను పరిశీలించి వార్తలు రాయలన్నారు. తాను తప్పుచేస్తే పెద్ద హెడ్ లైన్లో రాయాలని, ఎవరి మెప్పుకోసమో వాస్తవికతను దాచి తప్పుడు రాతలు రాయొద్దని కోరారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి నాడు ఇచ్చిన హామీలు, తాను నెరవేర్చేందుకు జగన్ కృషిచేస్తున్నట్లు తెలియజేశారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ, మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, మహిళలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన హామీని 30లక్షలకు పెంచి ఆదుకుంటున్నారన్నారు. కరోనా మహమ్మారి వలన ఆసుపత్రుల నిర్మాణం, 14 వైద్య కళాశాలల నిర్మాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అన్నారు. తామంతా ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీఅని, తమలో ఎటువంటి విభేధాలు లేవని, తమ నాయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలియజేశారు. తమలో విభేదాలు ఉన్నాయని ప్రచారం చేయడం లో నిజం లేదన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు రూ.45కోట్లు ఖర్చుచేసి జిల్లాలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ధర్మాన కృష్ణదాస్ కృషి వల్లే ఎంపిక చేశారని, త్వరలో చెరువుల గట్లపై మొక్కలు పెంపకం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదాలకు కారణం చంద్రబాబునాయుడు అనే విషయం అందరికీ తెలుసన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ పిరియా సాయిరాజ్, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ఎంవీ.పద్మావతి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ l శిమ్మ రాజశేఖర్, కామేశ్వరి, టి. నాగేశ్వరరావు, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 3, 2021 at 8:10 సా.