Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బయటపెడుతా అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమమే “ఇదేం ఖర్మ”. ఈ కార్యక్రమం మొన్నటి వరకు ఉత్తరాంధ్రలో జరిగింది. అక్కడ ఈ కార్యక్రమం చాల పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో నిర్వహించడానికి టీడీపీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి నేతలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు . ఇప్పటి నెల్లూరులో టీడీపీకి ఒక్క సీట్ కూడా లేదు. అక్కడ మొత్తం వైసీపీ నే రాజ్యమేలుతుంది. ఇప్పుడు టీడీపీ అక్కడికి వెళ్లి పాక వెయ్యడానికి పెద్ద ప్లాన్ తో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తున్నారు. కోవూరు, కావలి అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో కూడా పార్టీని బలోపేతం చెయ్యడానికి బాబు వ్యూహాలు వేస్తున్నారు. ఈ ఇదేం ఖర్మ కార్యక్రమంలోనే బాబు అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యబోయే అభ్యర్థుల గురించి చెప్పే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
అభ్యర్థుల వివరాలు చెప్తాడా!!
ప్రస్తుతానికి కందుకూరులో వైసీపీ తరఫున మానుగుంట మహీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ మానుగుంట వైసీపీ తరపున చాల గట్టిగా పని చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్నా వారిలో పోతుల రామారావు, దివి శివరాం, యింతురు నాగేశ్వర రావు బరిలో ఉన్నారు. వీళ్ళలో బాబు ఎవరికీ టికెట్ ను కంఫర్మ్ చేస్తారో చూడాలి. అలాగే కావలిలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుండి 2019 కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా విష్ణుకే సీట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కోవూరులో నల్లపు ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు పోటీగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి కొడుకు దినేష్ రెడ్డిని పోటీకి దింపడానికి టీడీపీ ప్లాన్ చేస్తుంది. ఈ విషయాలను చంద్రబాబు నాయుడు రేపు కార్యక్రమంలో ఆఫీసియల్ గా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
టీడీపీకి అవకాశం ఇస్తారా!!
వచ్చే ఎన్నికల్లో నెల్లూరులో కావలి, కోవూరు, కందుకూరులో ఎలాగైనా గెలవడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఇక్కడ టీడీపీకి ఒక్క సీట్ కూడా లేదు, పైగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వైసీపీ నాయకులకు ప్రజల నుండి మద్దతు గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్క కోవూరులో తప్పా ఎక్కడా కూడా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల నుండి ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇక్కడ మాత్రమే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్లకు చేసిందేమి లేదు. ఇప్పుడు వచ్చి తాము అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మాయమాటలు చెప్తే నెల్లూరు ప్రజలు నమ్ముతారో లేదో వచ్చే ఎన్నికలో ప్రజలే నిర్ణయిస్తారు.