Chandrababu : వైసీపీ ప్రభుత్వం వచ్చాక జాబ్స్ ఇవ్వడమే లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జాబ్స్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో అందరికీ తెలుసు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 5.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అంతే కాదు.. ఏపీకి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు.
కియా మోటర్స్ ను ఎవరు తీసుకొచ్చారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వచ్చాయంటే దానికి కారణం టీడీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం వచ్చక ఏపీకి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలేదు. అసలు టీడీపీ అధికారంలో ఉంటే కడప స్టీల్ ప్లాంట్ కూడా పూర్తయ్యేది. ఇంకా ఎన్ని సార్లు కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనలు చేస్తారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
Chandrababu : జగన్ ప్రజలకు నమ్మకం కాదు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం
జాబు రావాలంటే బాబు రావాలని.. అదే ఇప్పుడు అందది నినాదం అని చంద్రబాబు అన్నారు. ప్రజలకు జగన్ నమ్మకం కాదు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని చంద్రబాబు దుయ్యబట్టారు. పోలీసులకు కనీసం టీఏ, డీఏలు కూడా ఇవ్వడం లేదు. జీతాలు ఎప్పుడు పడతాయో ఉద్యోగులకు కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్రం ఉంది. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్, చంద్రన్న భరోసా, విదేశీ విద్య ఏమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్ ప్లాన్ ఏమైంది అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
రాయలసీమలో ఫ్యాక్షన్ ని టీడీపీ అణచివేస్తే.. వైసీపీ వచ్చాక రాష్ట్రంలో హత్యలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. ఎవరు అడ్డు వస్తే వాళ్లను చంపేస్తారా? వివేకా హత్య కేసుపై ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు. వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతాం అన్నారు చంద్రబాబు.
టీడీపీ హయాంలో ఇచ్చిన మైక్రో, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాల గురించి ఈసందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. తాము అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేవారిమన్నారు. రాయలసీమ ద్రోహి ఎవరో కాదు.. జగన్ అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.