Kadiyam Srihari: తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. మొన్నటి బీజేపీ నేతలే నేరుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు కొంతమంది నాయకులను రాష్ట్రంలోకి తెచ్చి వాళ్ళతో కూడా కేసీఆర్ పై విమర్శలు చేయిస్తున్నారు. అలా వచ్చిన వారిలో షర్మిలా కూడా ఒకరు. ఇప్పుడు తెలంగాణాలో జరిగే ప్రతి అంశంపై కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ కొత్త సీసాలో పోసిన పాత సారాలా ఉందని విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు చాల ఆగ్రహంతో స్పందిస్తున్నారు. అయితే షర్మిలను విమర్శిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకానందా హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.
జగన్ జైలుకే ఇక
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో వైఎస్ ఫ్యామిలీ ఉందని, అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన షర్మిల ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చెయ్యడం, ఏకంగా తెలంగాణ బడ్జెట్ పై విమర్శలు చేసే స్థాయి లేదని కడియం శ్రీహరి తెలిపారు. ఏపీ నుండి వచ్చిన షర్మిల ఏపీకి తెరిగి వెళ్ళిపోతేనే మంచిదని, త్వరలో ఎలాగో వైఎస్ వివేకానందా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే షర్మిలకు ఏపీకి వెళ్తే , అక్కడ సీఎం అయ్యే అవకాశం షర్మిలకు ఉందని కడియం శ్రీహరి తెలిపారు. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా రెండు రాష్ట్రలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీలోని రాజకీయ నాయకులు కూడా వైఎస్ వివేకానందా కేసులో జగన్ జైలుకు వెళ్లాడని అంటున్నారు. కానీ అవన్నీ రాజకీయ విమర్శలని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు తెలంగాణ నాయకులు కూడా అంటుండటంతో ఈ చర్చ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది.
షర్మిల సీఎం అవుతుందా!!
ఏపీలో ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్య కేసు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణాలో కూడా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ వైఎస్ వివేకానంద హత్య కేసులో జగన్ కు సంబంధం ఉన్నట్టు తెలిస్తే, ఈ కేసులో జగన్ జైలుకు వెళ్తే ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరన్నా చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే అయన స్థానంలో షర్మిల పాదయాత్ర చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే అక్కడ మళ్ళీ ఆయన స్థానంలో షర్మిలా సీఎం అవుతుందేమో చూడాలి. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టం కానుంది.