కరీంనగర్ అభివ్రుద్ది కోసం సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని,  410 కోట్లతో సర్వాంగ సుందరంగా మానేరు రివర్ ప్రంట్, మెదటి విడతలో 4కిలోమీటర్లు ప్రాజెక్టుకోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, అర్కిటెక్చరల్, ఇంజనీరింగ్ డిజైన్ల పనులకోసం టెండర్లు పిలిచిన సర్కార్ జూలై నెలాఖరు కల్లా డీపీఆర్, ఆగస్టు నుండి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోబోతున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  అంతేకాక ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని,మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఇవికాకుండా రూ.80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు చివరి ధశల్లో ఉన్నాయి. ఇప్పటికే మంత్రులు కేటీఆర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారితో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుకు సంబందించి అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. అనంతరం మానేరు రివర్ ఫ్రంటు నిర్మాణ పనుల డీపీఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ సైతం జారీ అయింది. ఇప్పటికే ఎల్ఎండీ లైటింగ్తో సర్వాంగ సుందరంగా ముస్తాబై వీక్షకులకు కనువిందు చేస్తుంది,

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం: మంత్రి గంగుల కమలాకర్ 

మానేరు రివర్ ఫ్రంట్ పూర్తైతే ప్రపంచస్థాయి టూరిస్ట్ కేంద్రంగా కరీంనగరం మారుతుందని, తెలంగాణలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారబోతున్నదని, తెలంగాణ అన్ని రంగాలలో దూసుక పోతున్నదని, ప్రతి పక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు మా వెంట ఉంటారని, ప్రతిపక్షాల కళ్ళబొల్లి కబుర్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి గంగుల అభిప్రాయ పడ్డారు.  ఇంకో 15 ఏళ్లు తెరాస అధికారంలో ఉంటుందని, తెలంగాణ కెసీఆర్ తోనే అభివృద్ధి చెందుతుందని, మరెవ్వరూ టీఆర్ఎస్ విజయాన్ని అపలేరని మంత్రి గంగుల అన్నారు.  ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, కాడ్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్ రావు, శంకర్, టూరిజం కార్పోరేషన్ ఎండి మనోహర్ రావు, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగబూషణం, ఏకాం ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 22, 2021 at 5:55 సా.