AMITH SHAH:అమిత్ షాకు వేసిన తెరాసా, కాంగ్రెస్ ప్రశ్నల్లో న్యాయం ఉందా!!

Arjun

AMITH SHAH:బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పడానికి అమిత్ షా వస్తే ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందని కాంగ్రెస్, తెరాస నాయకులు ప్రశ్నలు సంధించారు.

amith shah

ఈ ప్రశ్నలకు ఎప్పటిలాగే బీజేపీ నాయకులు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. అయితే అధికారంలోకి వస్తే ఏమి చెప్పిన అమిత్ షా ఇప్పటి వరకు ఏమి చేశారో చెప్పక పోవడంతో బీజేపీ యొక్క రాజకీయ కుట్ర ప్రజలకు బోధపడింది.

ప్రశ్నల్లో న్యాయం ఉందా!

తెరాసా, కాంగ్రెస్ నాయకులు అమిత్ షాకు సంధించిన ప్రశ్నల్లో న్యాయం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాకు 27 ప్రశ్నలను సంధించారు. రాష్ట్రానికి న్యాయబద్దంగా రావలసిన ప్రాజెక్ట్ లు, నిధులు, ప్రయోజనాలకు సంభందించిన ప్రశ్నలు వేశారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నలు సంధించారు. కేసీఆర్, బీజేపీ నాయకులు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తప్పించుకున్న అమిత్ షా

కాంగ్రెస్, తెరాసా వేసిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా అమిత్ షా సమాధానం ఇవ్వలేదు. ఇప్పటిలాగే కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తన స్పీచ్ ను కొనసాగించి, తప్పించుకున్నారు. తెలంగాణకు నిజంగా బీజేపీ ఏదైనా చేసి ఉంటె ఎందుకు వాటిని ప్రజలకు చెప్పలేకపోయాడంటే ఎందుకంటే బీజేపీ రాష్ట్రానికి అదనంగా చేసిందేమి లేదు కాబట్టి. పక్క రాష్ట్రానికి అప్పుల విషయంలో వెసలుబాటు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం అడ్డుపడుతుంది. ఇలా ఎన్నో విషయాల్లో తెరాసపై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపుతున్న బీజేపీ నాయకులు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతున్నారో అర్ధం కావడం లేదు.

- Advertisement -