CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపర్చడానికి కాంగ్రెస్ నాయకులే బలంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీకి రాష్ట్రంలో బలపడటానికి ఎన్నో అవకాశాలు ఉన్నపట్టికి, వాటిని పట్టించుకోకుండా, పాతాళంలోకి నెట్టుకుంటున్నారు. తమలో తాము కలిసికట్టుగా ఉండలేని నాయకులు, రాష్ట్రంలో బలపడటానికి ప్రయత్నిస్తుంటే వేరే పార్టీ వాళ్లకు, రాష్ట్ర ప్రజలకు కామెడీగా ఉంది.

కొన్ని సంవత్సరాల వరకు బీజేపీ పార్టీ గురించి ఎవ్వడికి తెల్వదు, అలాంటి పార్టీనే ఇప్పుడు రాష్ట్రంలో తెరాసాకు ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్నా కూడా కాంగ్రెస్ నాయకులూ మాత్రం వాళ్లలో వాళ్ళే కొట్టుకుంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో వర్గ పోరాటం రాహుల్ గాంధీ కూడా ఆపలేరని తేలిపోయింది. వచ్చే నెలలో రాహల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వరంగల్లో రైతు సంఘర్షణ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి భారీ ప్రజలను తీసుకోని వచ్చి, తమ బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంలోనే రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు పెట్టకూడదని కోమటి బహిరంగంగానే చెప్తున్నారు.
కాంగ్రెస్ నాయకులకు చెప్పటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. ఎందుకంటే తెరాసా, బీజేపీ అధికారంలో కోసం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం తమలో తాము కొట్టుకు చస్తూ, కాంగ్రెస్ ను పతనావస్థకు చేర్చారు. రాహుల్ గాంధీ లాంటి నాయకులు వస్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు కలవలేకపోతున్నారు.