Rahul Gandhi:తెలంగాణాలో మాటకు మాత్రమే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. వాస్తవంగా అసలైన రాజకీయం బీజేపీ, తెరాసా మధ్య జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులు బలంగా ప్రయత్నిస్తున్నారు.

దానిలో భాగంగానే రాహుల్ గాంధీని రాష్ట్రానికి పిలిచి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. వరంగల్ వేదికగా జరిగిన సంఘర్షణ సభతో రైతుల్లకు తాము ఏమి చేస్తామో చెప్పే ప్రయత్నం చేశారు.
లక్ష్యాన్ని సాధించారా!!
రాష్ట్రంలో బీజేపీ, తెరాసా మధ్యనున్న రాజకీయాన్ని తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులు నానా తిప్పలు పడ్డారు కానీ ఆ పార్టీలా తాకిడికి తట్టుకోలేకపోయారు. అయితే రాహుల్ పిలిచి సభపెడితే రాజకీయంగానూ, ప్రజల్లోనూ తమ ఉనికిని చాటుకోవచ్చని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. అయితే సభ పెట్టడం వల్ల కాంగ్రెస్ నాయకులూ తాం అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు తెలుస్తుంది. రాహుల్ రాకను అడ్డుకోవడానికి తెరాసా అన్ని ప్రయత్నాలు చేసింది, అలాగే కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ అకౌంట్ ఆన్ ఫాలోకొట్టి తన భయాన్ని కూడా బయటపెట్టుకున్నారు.
కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందా!!
ఇప్పటివరకు ఎలాంటి దిశా, ప్రణాళిక లేకుండా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు రాహుల్ వచ్చి దిశా నిర్ధేశం చేశారు. నూతన ఉత్సహం నింపారు. రైతులకు తాము చెయ్యబోయే విషయాలను చెప్పి ప్రజల కొంతమేరకు సంపాదించుకున్నారు. రాహుల్ రాకతో ఇతర పార్టీల రాజకీయ నాయకుల్లో భయం పుట్టడంతో పాటు కాంగ్రెస్ నాయకుల్లో, కార్యకర్తల్లో కూడా ఉత్సాహం పెరిగింది.