కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికలు చెప్పినా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు పేపర్లలో చూసి వెంటనే స్పందించిన సంఘటనలు నా జీవితంలో చాలానే ఉన్నాయి. కరోనాతో అగ్ర దేశాలే వణికిపోతున్నాయి. కరోనాను అర్ధం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప.. దీనిని నివారించలేమని నేను మొదట్లో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సమాజాన్ని కాపాడేందుకు అనుక్షణం పని చేశాను. కరోనా రాకుండా నివారించడమే పరిష్కార మార్గమని చెప్పినా జగన్ రెడ్డి వినలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
కరోనా వైరస్ ఒకరిని నుంచి మరొకరకి వస్తుంది, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తే నన్ను అవహేళనగా మాట్లాడారు. అనేక రంగాల నిపుణులు, మేథావులతో మాట్లాడాను. పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ వేస్తే కరోనా రాదని ముఖ్యమంత్రి చెప్పారు. 5 కోట్ల ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించమని పదే పదే చెబితే పట్టించుకోలేదు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కేసులు బనాయించారు. చాలా దేశాలు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి. మన ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోలేదు. 16.50 లక్షల మంది పది, ఇంటర్ పరీక్షల విషయంలో విద్యార్ధులను భయబ్రాంతులకు గురి చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే మీరెందురు నిర్వహిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే తప్పుడు లెక్కలు ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ఒక వేళ ఒక్క విద్యార్ధి చనిపోతే రూ. కోటి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబితే ముఖ్యమంత్రి తోక ముడిచి అప్పుడు పరీక్షలు రద్దు చేశారు.

ముఖ్యమంత్రికి సత్తా ఉంటే ఉన్న చట్టాలు సరిపోతాయి: చంద్రబాబు నాయుడు 

కరోనా బాధితులను ఆదుకోవాలని టీడీపీ దీక్ష పెడితే దానిని పక్క దారి పట్టించేందుకు దిశ చట్టం అంటున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే 24 గంటల్లో పరిష్కరిస్తానని జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. కొత్త చట్టాలు కాదు కావాల్సింది.. ముఖ్యమంత్రికి సత్తా ఉంటే ఉన్న చట్టాలు సరిపోతాయి. 14 ఏళ్ల నా పాలనలో తప్పు చేసిన వారికి తరువాత రోజే ఏం చేశామో మీరే చూశారు. పరిపాలన సత్తా ఉంటే, పద్ధతి ప్రకారం పాలన చేస్తే.. చట్టానికి బద్దులై ఉంటారు. దిశ చట్టం తిరుగుటపాలో మళ్లీ వచ్చింది. చట్టం లేదు కాని పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చారు. చట్టం లేదు.. మళ్లీ వెహికల్స్ తీసుకువచ్చారు. చట్టం లేదు.. ఇప్పుడు యాప్ తీసుకువచ్చారు.
ముఖ్యమంత్రి ఇంటి పక్కన, డీజీపి ఆఫీస్ కు కూత వేటు దూరంలో మహిళను అత్యాచారం చేస్తే దోషులను ఇంత వరకు పట్టుకోలేదు. జగన్ రెడ్డి పత్రిక సాక్షికి లాభాలు కావాలని ప్రతి రోజు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. హోల్ సేల్ గా అవినీతి చేసి డబ్బులు చేయాలన్న యావ తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ధ్యాస జగన్ రెడ్డిలో లేదు. కరోనా బాధితులకు ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్లు ఎన్ని కావాలో జగన్ రెడ్డి ఎప్పుడైనా ఆలోచించారా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు. కరోనా వ్యాధితో కొంత మంది కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నారు. భార్య, భర్త ఇద్దరు చనిపోతే పిల్లలు చూడలేని పరిస్థితి. తాడేపల్లి ప్యాలెస్ లోని ముఖ్యమంత్రికి కనికరం లేదా? మనస్సు మారలేదా? నా కొడుకును కాపాడండి మందుల లేవు, ఎక్కడ చూసి బ్లాక్ లో మందులు అమ్ముతున్నారని ఒక తల్లి వేడుకున్నా ముఖ్యమంత్రికి మనస్సు లేదని చంద్రబాబు నాయుడు అన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 29, 2021 at 6:57 సా.