ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సీఎం దళిత ఎంపవర్ మెంట్ అఖిలపక్ష సమావేశం కొనసాగుతున్నది. దళితుల అభ్యున్నతికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో అఖిలపక్షం సూచనలు, సలహాలు స్వీకరించాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని కెసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత శ్రీ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి శ్రీ తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చాడ వెంకట్ రెడ్డి, ఎంఐఎం పార్టీ, యాకుత్ పుర ఎమ్మెల్యే శ్రీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, పెద్దపల్లి ఎంపి శ్రీ వెంకటేష్ నేత బొర్లకుంట, నాగర్ కర్నూల్ ఎంపి శ్రీ పోతుగంటి రాములు, వరంగల్ ఎంపి శ్రీ పసునూరి దయాకర్, రైతు బంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పిడమర్తి రవి, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ ఎమ్.ఎస్. ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు శ్రీ డి. రాజేశ్వర్ రావు, శ్రీ గోరటి వెంకన్న, చెన్నూర్ ఎమ్మెల్యే శ్రీ బాల్క్ సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య, జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే, చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే శ్రీ రసమయి బాలకిషన్, ఆందోళ్ ఎమ్మెల్యే శ్రీ క్రాంతి కిరణ్ చంటి, జహీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ కె. మాణిక్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలె యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ మెతుకు ఆనంద్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ జి. సాయన్న పాల్గొన్నారు.

సమావేశాన్ని బహిష్కరించిన బీజేపీ పార్టీ 

అచ్చంపేట్ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు, ఆలంపూర్ ఎమ్మెల్యే శ్రీ విఎం అబ్రహం, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే శ్రీ గ్యాదరి కిషోర్ కుమార్, ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీ తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి శ్రీ కడియం శ్రీహరి, మాజీ ఎంపి శ్రీ మంద జగన్నాథం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ ఎర్రోళ్ళ శ్రీనివాస్, టీఆరెఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రవణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ కృషాంక్, శ్రీ శ్రీధర్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేష్ కుమార్, సిఎంవో అధికారులు శ్రీ నర్సింగ్ రావు, శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీమతి స్మితా సబర్వాల్, శ్రీ శేషాద్రి, శ్రీ శ్రీధర్ దేశ్ పాండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ శ్రీ రాహుల్ బొజ్జా, బుద్దవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ మల్లే పల్లి లక్ష్మయ్య, ఎస్సీ కార్పోరేషన్ వైస్ చైర్మన్ మరియు ఎండి శ్రీ కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరక్టర్ శ్రీమతి ఉమా దేవి, శ్రీ జి.టి. వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 27, 2021 at 3:58 సా.