Caste Discrimination: దళితులపై దాడులు ఆగవా! ఇంకెన్నాళ్లు ఈ కుల వివక్ష ?

Arjun

Caste Discrimination: కులం పేరుతో మనుషులను వేరు చేస్తూ, వివక్షకు గురి చేసి, మనుషులను అణిచివేసేలా చేసిన ఘనత మన దేశంలో ఉన్న హిందుత్వానికి ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా కూడా ఇంకా దళితులపై దాడులు ఆగడం లేదు.

dalith men was killed by muslim men

హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన సంఘటనకు రాష్టం మొత్తం షాక్ గురి అయ్యింది. హిందు మతంలోని అగ్ర వర్ణాలకు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు కూడా దళితులపై వివక్ష చూపుతున్నారు.

హైదరాబాద్ ఘటన

నాగరాజు(దళిత్), ఆశ్రిన్ సుల్తానా స్కూల్ టైం నుండి ప్రేమించుకుంటున్నారు. నాగరాజు తక్కువ కులానికి చెందిన వాడు కాబట్టి ఆశ్రిన్ కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. నాగరాజు ఇస్లాం పుచ్చుకుంటానని చెప్పినా కూడా పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే పెద్దల వ్యతిరేకంగా ఆశ్రిన్, నాగరాజు పెళ్లి చేసుకున్నారు. ఇది నచ్చని అమ్మాయి సోదరుడు, అతని స్నేహితులు కలిసి నాగరాజును సరూర్ నగర్ నడిరోడ్డుపై గడ్డపారతో తల పగలకొట్టి చంపారు.

ఇది కుల హత్యే

ఈ ఘటనను బీజేపీ నాయకులు మతాల మధ్య గొడవగా సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది హిందూ మతం నుండి బయటకు తోసివేయబడి, వివక్షకు గురి ఐన కులానికి చెందిన వ్యక్తిని, ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు చంపడం. ఈ విషయానికి మద్దతు తెలుపుతున్న హిందూ మతవాదులు ఈ ఘటన జరగడానికి హిందూ మతమే ముఖ్యకారణమని తెలుసుకుంటే మంచిది. హిందూ మతం వాళ్ళ ఏర్పడ్డ కులాల వల్లే ఇంకా దేశంలో కులం పేరిట జరుగుతూనే ఉన్నాయ్. అవకాశం వచ్చినప్పుడల్లా రిజర్వేషన్ పై పది ఏడ్చే అగ్ర వర్ణాల ప్రజలు ఎలాంటి ఘటనలు జరిగినప్పుడు అన్నీ మూసుకొని కూర్చుంటారు. కులాల ఏర్పాటుకు హిందూ మతం పోయే వరకు కుల వివక్ష ఎప్పటికీ పోదు.

- Advertisement -