KCR: తెలుగు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి తెలుగు నేలకు గుర్తింపు తెచ్చిన వారిలో అన్న రామారావు ఒకరు. ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టి తెలుగు రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని రచించారు. అయితే ఆయన్ను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని, ఆయన నుండి పార్టీని బాబు లాక్కున్నారని తెలుగు ప్రజల్లో ఒక వార్త ప్రచారంలో ఉంది. అయితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని దక్కించుకున్న బాబును కూడా గతంలో వెన్నుపోటు పొందడానికి సిద్ధమయ్యారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుకు దక్కితే, బాబునే వెన్నుపోటు పొడిచిన ఘనత కేసీఆర్ కు వచ్చేదని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయముల ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎమ్మెల్యేలకు ఎరా
గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పట్లో వ్యూహాలు రచించారని కేసీఆర్ ఫ్రెండ్, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు 60 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ టచ్ లోఉండి, బాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమయ్యారని, ఈ విషయాన్ని ముందే పసిగట్టి పడటం వల్ల కేసీఆర్ వ్యూహం పారలేదని శ్రీనివాస్ తెలిపారు. సొంత పార్టీ పెట్టడానికి ముందు ఈ పని కేసీఆర్ చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఐన రాజకీయ పార్టీల్లో ఎవరు నీతిగా ఉండరు కాబట్టి ఇలాంటివన్నీ సహజమే.
కొత్తేమి కాదు
ఎమ్మెల్యేలను కొనడం, వాళ్లకు మాయ మాటలు చెప్పి తన వైపు తిప్పుకోవడం కేసీఆర్ కు అలవాటేనని, గత ఎన్నికల్లో వేరే పార్టీల్లో గెలిచిన నాయకులను డబ్బులిచ్చి మరీ తన పార్టీలోకి లాక్కున్నారని, అలాంటి కేసీఆర్, గతంలో కూడా బాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదని ప్రతిపకక్షల నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారని కేసీఆర్ అంటూ ఉంటారు కానీ నిజానికి కేసీఆర్ యే ఆ పని చేశారని శ్రీనివాస్ వెల్లడించారు. కేసీఆర్ కు బాబుపై ఉన్న కోపం ఇప్పటిది కాదని, ఎప్పటి నుండో ఉన్న కోపం వల్లే కావొచ్చు 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు.