Jagan: వైసీపీ ప్రభుత్వానికి డాక్టర్ బీ . ఆర్ అంబేద్కర్ గారి మీద చాలా ప్రేమ చూపిస్తుంది. దాని వెనక రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయని చెప్పనవసరం లేదు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలోని అంశాలను ప్రజలకు వివరించాల్సిన ప్రభుత్వాలు కేవలం అంబేద్కర్ విగ్రహం దగ్గరే ప్రజలను ఆగిపోయేలా చేస్తుంది. మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే మనకు రాజ్యాంగం మీద అవగాహనా ఉండాలి. రాజ్యాంగం మీద అవగాహనా వచ్చేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత ప్రభుత్వాలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతివనం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని మార్చి నెల వరకు పూర్తి చెయ్యాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

విగ్రహ విశేషాలు
ఈ విగ్రహ నిర్మాణ విషయంలో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో చర్చించారు. విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల పొడవు వస్తుందని అధికారులు వివరించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రూ.268 కోట్లుగా నిర్ణయించారు. పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం ఉంటుందని అధికారులు లెక్కలు చెప్పారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని అధికారులు వెల్లడించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారు. దాదాపు రెండు వేలమంది పట్టేలా కన్వెన్షన్ సెంటర్ ను కూడా నిర్మిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
విజయవాడ రాజకీయాలు
ఏపీలో మూడు రాజధానుల రాజకీయంతో విజయవాడ అధికార – ప్రతిపక్షాలకు కీలకంగా మారింది. అక్కడ ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని వర్సస్ నగర టీడీపీ నేతల పంచాయితీ కొనసాగుతోంది. విజయవాడలో రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అనినాశ్ కు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. విజయవాడ ఈస్ట్ లో టీడీపీ నేత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కేవలం ఒక్కటే ఎమ్మెల్యే సీట్ ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలవడానికి ఇప్పటికే వ్యూహాలురచిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండి టీడీపీ ఆధిపత్యం సాధిస్తుందో లేదా వైసీపీ సాధిస్తుందో చూడాలి.