AMITH SHAH: బీజేపీకి అసలు ప్రజలను ఓట్లు అడిగే హక్కుందా!!

Arjun

AMITH SHAH: తక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ నేత అమిత్ షా పాల్గొన్నారు. బండి సంజయ్ చేస్తున్న ఈ పాదయాత్రం ముగింపు సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ లాంటి అవినీతి పాలనకు తానూ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలోనూ చూడలేదని, రజాకార్ల ప్రభుత్వం తెలంగాణాలో నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AMITH SHAH

ఈ వ్యాఖ్యలు విన్న ప్రజలు ఒక్కసారి అమిత్ షా తనను తానూ ఆత్మ పరిశీలన చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మంచిదని భావిస్తున్నారు. కేసీఆర్ పాలన ఎలా ఉందొ ఒక్క నిమిషం పక్కన పెడితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి అధికంగా ఉందని ఎన్నో సర్వేలు చెప్తున్నాయి.

బీజేపీకి ఓటు అడిగే హక్కుందా!!

బీజేపీ నాయకులు అవినీతి గురించి , అణిచివేత గురించి మాట్లాడుతూ ఓట్లు అడగటం కంటే పెద్ద జోక్ ఇంకొకటి లేదు. వాళ్ళు చేస్తున్న మోసాల గురించి, ప్రజా ధనాన్ని దుర్నియోగం చెయ్యడం గురించి సర్వ్ లు చెప్తున్నాయి. ఇలాంటి నాయకులు ఇప్పుడు వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. 2014 నుండి ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో ప్రజలు చెప్పాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా దేశంలో మాత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే నాయకులు కూడా శాంతి గురించి మాట్లాడటం ఒక పెద్ద జోక్.

జాబ్ క్యాలెండర్ అంట

జాబ్స్ గురించి మాట్లాడాలని అమిత్ షా ఎలా అనిపించిందో అర్ధం కావడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యలేదు కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణాలో అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తారంటా . ఇది నమ్మడానికి తెలంగాణ యువత మరీ అంత పిచ్చి వాళ్ళు కాదు. దేశంలో నిరుద్యోగ శాతంలో పెరుగుతుందని ఎన్నో సర్వేలు చెప్తున్నప్పటికీ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా పైగా సర్వ్ లు చేసిన వాళ్ళను తప్పు పడుతూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు.

- Advertisement -