KTR: బీజేపీ అధికారంలోకి వచ్చినా తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి చేరుకుంది. ఎప్పుడు లేనంత కిందికి వెళ్ళిపోయింది. దేశంలో ఉన్న ప్రజల ఆదాయం కూడా తగ్గిపోయింది. కానీ దేశంలో ఉన్న ఒక వ్యక్తి సంపాదన మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. అతనే గౌతమ్ అదానీ. బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు అతను అప్పుల్లో ఉండేవాడు కానీ ఇప్పుడు అతను ప్రపంచంలో మూడో ధనవంతుడి జాబితాలోకి వెళ్లారు. ఇప్పుడు ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ… హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ వాళ్ళు ఒక రిపోర్ట్ ను విడుదల చేశారు. అసలు అదానీ ఆస్థి ఇంతలా ఎలా పెరిగిందని ఆ రిపోర్ట్ క్లియర్ గా వివరించింది. ఈ నివేదిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని, అదానీకి అండగా ఉన్న బీజేపీని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నిస్తున్న వారిలో కేటీఆర్ కూడా చేరారు.

హిండెన్ బర్గ్ రిపోర్ట్ లో ఏముంది??
అదానీ చాలా కాలంగా స్టాక్ మ్యానిపులేషన్ కు పాల్పడుతున్నాడని, వాస్తవంగా ఉన్న కంపెనీ వేల్యూ కంటే ఎక్కువ వేల్యూ చూపిస్తూ, స్టాక్ మార్కెట్ లో షేర్స్ కు ఎక్కువ రేట్ కోట్ చేసేవాళ్ళని రిపోర్ట్ లో వెల్లడించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్, కొన్ని కరేబియన్ దేశాల్లో అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను ఆధారంగా చేసుకుని పలు డమ్మీ కంపెనీలు నెలకొల్పడానికి అదానీ కుటుంబం సహకరించినట్లు నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతలు, దిగుమతులు చేస్తుందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు దారి మళ్లించింది రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ ను తయారు చెయ్యడానికి అదానీ కంపెనీలో పని చేస్తున్న వాళ్ళ నుండే ఇన్ఫర్మేషన్ తీసుకున్న హిండెన్ బర్గ్ వాళ్ళు తెలిపారు.
కేటీఆర్ సవాల్
ఈ రిపోర్ట్ ను ఆధారంగా చూసుకొని కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరాడు. దేశంలో ప్రతిపక్షాల మీద ఎలాగైతే ఇష్టమొచ్చినట్టు ఈడీ, సిబిఐలను బీజేపీ ప్రభుత్వం ఉపయోగిస్తుందో అలాగే ఇప్పుడు అదానీ మీద ఉపయోగించాలగదా అని ప్రశ్నించారు. దమ్ముంటే అదానిపై విచారణకు ఆదేశాలు జారీ చెయ్యాలని సవాల్ విసిరాడు. ఈ రిపోర్ట్ గురించి దేశంలో ఉన్న ఏ నేషనల్ మీడియా సంస్థ కూడా చర్చించదని, సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన చర్చ జరగదని, బీజేపీ ఆ నివేదికను సోషల్ మీడియా నుండి కూడా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నల్లో న్యాయం ఉంది కానీ వాటిని స్వీకరించే దమ్ము మాత్రం బీజేపీ లేదు.