KTR: కేవలం మత రాజకీయాలు మాత్రమే చేసే బీజేపీ ఇప్పుడు కొత్తగా మత సామరస్యం, ఇతర మతాల గౌరవం గురించి మాట్లాడుతుంది. ఇతర మతాలను కించపరచడమే తమ లక్ష్యమన్నట్టు ప్రవర్తించే బీజేపీ నాయకులు సడన్ గా ఇలా మాట్లాడటం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఇద్దరు బీజేపీ నేతలు మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో వారిద్దర్నీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సస్పెండ్ చేశారు. ఏ మతాన్ని కించ పరిచినా, తాము ఊరుకోబోమని బీజేపీ నేతలు డైలాగులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బీజేపీకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇతర మతాలను కించపరచకుండా మాట్లాడిన ఒక్క బీజేపీ నాయకుడిని చూపించమని బీజేపీ పెద్దలను సోషల్ మీడియాలో యూజర్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు. బీజేపీ తాజా ప్రవర్తనతో ఇతర పార్టీల నాయకులు కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు.
సస్పెండ్ చేసే దమ్ముందా!!
బీజేపీలో చేరాలంటే ఉండే మొదటి క్వాలిటీ ఏంటంటే ఇతర మతాలను కించపరచడం. హిందూ మతం కాని వారిని కించపరిస్తే బీజేపీలో ఉన్నత స్థానంలో ఉంటారు. గతంలో మహాత్ముడ్నే దారుణంగా అవమానించి.. వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా బీజేపీ చర్యలు తీసుకోలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు యూపీలోని కాన్పూర్‌లో అల్లర్లకు కారణంగా మారిన ఇద్దరు బీజేపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ సందర్భంలో జేపీ నడ్డాకు సోషల్ మీడియాలో ప్రజలు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇతరం మతాలను కించపరిచే వాళ్ళందరిని సస్పెండ్ చేసే దమ్ముందా అని ప్రజలు బీజేపీని నిలిదీస్తున్నారు.
బండి సంజయ్ ను సస్పెండ్ చెయ్యాలి
ఈ సందర్భంలో జేపీ నడ్డాకు కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. అన్ని మతాలను గౌరవిస్తామని చెప్తున్న మాట నిజమైతే అన్ని మసీదులను తవ్వాలని, ఉర్దూపై నిషేధం విధించాలన్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోగలరా అని , ఎందుకు ఈ ఎంపిక చికిత్స నడ్డా జీ అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ ఏపీ తిరుపతి ఎన్నికల సమయంలో కూడా క్రిస్టియన్ మతాన్ని కించపరుస్తూ, హిందూ, క్రిస్టియన్స్ మధ్య వివాదం పెట్టడానికి ప్రయత్నించాడని ఏపీ ప్రజలు కూడా కేటీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు.