PRAVEENKUMAR:తెలంగాణాలోబహుజన రాజ్యం స్థాపించడానికి బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో పాదయాత్ర తెలిసిందే. అయన చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది.దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి , మోసం చేసిన సీఎం కేసీఆర్ పాలనను వ్యతిరేకించే వాళ్లు ,

ఉద్యమాలు చేసి ఇప్పుడు తెలంగాణ అక్కరకు నోచుకోని ప్రజలందరూ ప్రవీణ్ కుమార్ కు మద్దతు తెల్పుతూ ఉన్నారు. ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ అధికారిగా కంటే కూడా గురుకులాలను ఆయన విధానంతోనే తెలంగాణ ప్రజలకు తెల్సు.
రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా, తండ్రి పేరును వాడుకొని, నాయకుడిగా ఎదిగి, ఇప్పుడు తన డబ్బా కొట్టుకొనే ఇంటర్వ్యూలలో బిజీ ఉంటున్న తెరాసా నాయకుడు కేటీఆర్ ప్రవీణ్ కుమార్ పాదయాత్రపై స్పందించారు. ప్రవీణ్ కుమార్ బీజేపీ కోసం పనిచేస్తున్నాడని, తెరాసా ఓటు బ్యాంకును చీల్చి, బీజేపీకి మేలు చెయ్యడానికి ప్రవీఎం కుమార్ పని చేస్తున్నారని ఒక అజ్ఞానిలా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ TSWREIS మరియు TTWREIS లకు సెక్రటరీగా ఉన్నప్పుడే బీజేపీ చేస్తున్న రాజకీయాలకు, దళితులపై బీజేపీ నాయకులూ చేస్తున్న దాడులను ఖండించి, దళితుల నిలబడిన ప్రవీణ్ కుమార్ పై రాష్ట్రంలో హాస్పిటల్ లో ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టించుకోని కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం హాస్యాస్పదం. అలాగే అదే ఇంటర్వ్యూ లో కేటీఆర్ మాట్లాడుతూ ..”తెలంగాణ ఉద్యమం జరుగుతన్న సమయంలో, ఆ ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నించిన అధికారి ప్రవీణ్ అని” వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రవీణ్ కుమార్ ఉద్యమాన్ని అణిచివేయ్యడానికి ప్రయత్నించాడని అనుకుంటే, అతను రాజీనామా చేసే వరకు మీ ప్రభుత్వంలోనే TSWREIS మరియు TTWREIS లకు సెక్రటరీగా విధులు నిర్వహించినప్పుడు మీకు ఈ ఈ విషయాలు గుర్తు రాలేదా? అని తెలంగాణ ప్రజలుఅడుగుతున్నారు . దళితున్ని సీఎం చేస్తానని చెప్పి మోసం చేసిన తెరాసా నాయకులకు బహుజన రాజ్యం కోసం పాటుపడుతున్న ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడే అర్హత లేదని తెలంగాణ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
గురుకులాల్లో చదివే బహుజన బిడ్డలకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా విద్యను అందించడానికి ప్రణాళికలు రచించి, ఉన్నత చదువులు చదవాలన్న బహుజన బిడ్డల కోరికను నెరవేర్చిన గొప్ప నాయకుడు ప్రవీణ్ కుమార్. ఒక ఐపీఎస్ అధికారిగా కంటే కూడా TSWREIS మరియు TTWREIS లకు సెక్రటరీగానే ప్రవీణ్ కుమార్ కు ఎక్కువ గుర్తింపు ప్రజల్లోఉంది . విద్యార్థులకు స్వేరో అని ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆకాశమే వాళ్ళ హద్దని నిరూపించిన ప్రవీణ్ కు ప్రజల నుండి పాదయాత్రలో విశేష స్పందన లభిస్తుంది.