Vijayashanthi: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్ ను ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు తెలంగాణాలో విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి, వాళ్ళు చేస్తున్న తప్పులే వాళ్ళను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. మొన్న లిక్కర్ స్కాములో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ విషయాన్ని ఎంతవరకు రాజకీయం చెయ్యాలో, ఎంతవరకు రాజకీయం కోసం వాడుకోవాలో బీజేపీ వాళ్ళు అంతవరకు వాడుకున్నారు. కవితను విచారిస్తున్న రోజు బీజేపీ వాళ్ళు చూపించిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఆ అత్యుత్సాహంతో బీజేపీ నాయకుడైన బండి సంజయ్ బీజేపీని ఇరకాటంలో పడేశాడు. కవిత గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు సొంత పార్టీ నేతల నుండి కూడా వ్యతిరేకత చూస్తున్నాడు. ఈడీ వాళ్ళు అరెస్ట్ చెయ్యకుండా ముద్దు పెట్టుకుంటారా అన్నా బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

సంజయ్ కు ఎదురుతిరిగిన అరవింద్
కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ అరవింద్ కూడా తప్పు పడుతున్నాడు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని, బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని ధర్మపురి అరవింద్ హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదా అంటే పవర్ సెంటర్ కాదు అంటూ, అది అందరినీ సమన్వయం చేసే బాధ్యత అంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కు ఎంపీ అరవింద్ కు పడటం లేదని, వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు ఆ గొడవలు నిజమని తెలిసింది.
విజయశాంతి భయపడుతున్నారు
కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రతి పార్టీ వాళ్ళు బహిరంగంగా ఖండిస్తుంటే , బీజేపీ మహిళా నాయకురాలైన విజయశాంతి మాత్రం బండి సంజయ్ కు విపరీతంగా భయపడుతున్నారు. ఒక మహిళై ఉండి, మహిళపై చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ఇలా పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తానూ అంతర్గత మీటింగ్స్ లో ఖండిస్తానని, ఇది బయట ఖండించాల్సిన విషయం కాదని మీడియా ముందు చెప్తున్నారు. ఒక తప్పును డైరెక్ట్ గా తప్పని చెప్పకుండా ఇలా తప్పించుకు తిరగడం ఎందుకని బీఆర్ఎస్ మహిళా నాయకులు అంటున్నారు. అయినా మహిళల గురించి ఎంతో మాట్లాడే విజయశాంతి ఇలా పిరికితనంగా ప్రవర్తిస్తున్నారో ఎవ్వరికి అర్థం కావడం లేదు.