KTR: రాజకీయ నాయకులకు పరువు నష్టం ధావ వేసే హక్కుందా!!

Arjun

KTR:రాజకీయ నాయకులు తమ పరువు ప్రతిష్టలను కాపాడుకుంటూ, అవతలి నాయకుడి పరువు, ప్రతిష్టలకు భంగం కలగకుండా రాజకీయం చెయ్యడం ఎప్పుడో మర్చిపోయారు. ఎలాంటి ఇజ్జత్ లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి నాయకులే పరువు నష్టం ధావాలు వేస్తూ ఉంటారు. అసలు ప్రజలను ఉన్నత మార్గంలో నడిపించే వారు రాజకీయ నాయకులు అలాంటి నాయకులు

KTR

ఒక్కరు కూడా దేశంలో లేరు. అందరు విచక్షణారహితంగా ప్రవర్తించే నాయకులే. ఉన్నతమైన ప్రవర్తనతో ప్రజలకు ఆదర్శంగా ఉండే నాయకుడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు.

మైక్ దొరికితే ఒకరిని ఒకరు ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ, విమర్శలు చేసుకుంటూ పాయింట్ మాట్లాడటం మర్చిపోయారు. ఏ ఒక్క నాయకుడికి కూడా విశ్లేనాత్మకంగా మాట్లాడటం రాదు. కేవలం వేరే నాయకుడిని అమ్మ దగ్గర నుండి స్టార్ట్ చేసి పిల్లల వరకు తిట్టడం మాత్రమే వచ్చు. మళ్ళీ ఈ లుచ్చా నాయకులే ప్రజల దగ్గరకు వచ్చి అందరు హింసను వీడి అహింస మార్గంలో నడవాలని స్పీచ్ లు ఇస్తూ ఉంటారు. తమ ప్రత్యర్థిని తక్కువ చెయ్యడానికి ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తూ ఉంటారు. దానికి ఒక ఆధారం ఉండదు ఏమి ఉండదు. ఇలా ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ మళ్ళీ మా మనోభావాలు దెబ్బతిన్నాయని పరువు నష్టం ధావాలు వేస్తారు.

ఇలాంటి ధావాలు వెయ్యడానికంటే ముందు భూతులు మాట్లాడటం మానేయండి. ఒకరిని ఒకరు ఇష్టమొచ్చినట్టు తిట్టుకోకుండా పాయింట్ బై పాయింట్ మాట్లాడటం నేర్చుకోండి. రాజకీయ పరువు నష్టం ధావాలు వేసుకుంటే పోతే కోర్ట్ కు ఈ కేసులు చూసుకుంటూ కూర్చోవాల్సింది. ఎందుకంటే రాజకీయ ఆ రీతిలో మాట్లాడుతారు. బీజేపీ రాష్ట్ర నాయకుడైన బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ ఇద్దరు నాయకులు గతంలో మాట్లాడిన స్పీచ్ లు వింటే వీళ్లిద్దరు ఇప్పటికే ఒకరిపై ఒకరు ఒక 100, 200 సార్లు ధావాలు వేసుకోవాలి. చదువు రాని, మత రాజకీయాలు చేసే బండి సంజయ్ లాంటి వాళ్ళు భూతులే మాట్లాడుతారు వాళ్లకు పాయింట్ మాట్లాడటం రాదు, కనీసం కేటీఆర్ లాంటి చదువుకున్న నాయకులన్నా కుక్కలా ఇష్టమొచ్చినట్టు అరవడం ఆపి, పాయింట్ మాట్లాడితే బాగుంటుంది.

- Advertisement -