YS JAGAN MOHAN REDDY

Jagan:వైసీపీ ప్రభుత్వానికి నిత్యం కేంద్ర సంస్థల నుండి, కోర్టుల నుండి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. మొన్నటి వరకు ప్రభుత్వం చేసే ప్రతిపనిపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసేది. అయితే ఇప్పుడు చివరికి ఎన్నికల కమిషన్ నుండి కూడా వైసీపీ ప్రభుత్వానికి చివాట్లు తప్పడం లేదు. అధికారం చేతిలో ఉంది కదాని ఇష్టమొచ్చినట్టు చేస్తే ప్రభుత్వ సంస్థలు, కోర్టులు చూస్తూ ఊరుకోవు కదా. అందుకే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ నుండి ఒక వార్నింగ్ వచ్చింది. ఏపీలో వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని.. ఓటర్ల జాబితా అంశంలోనూ చేతి వాటం చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సమయంలో ఇలాంటి ఆదేశాలు రావడం ఏపీ రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. అయితే జగన్ ప్రభుత్వం ఈ వార్నింగ్ ను ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి.

Jagan
ys jagan mohan reddy

ఆధార్ అనుసంధానం

ఓటర్ కార్డు కు ఆధార్ కార్డు ను అనుసంధానం చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పుడు ఆగష్టు 1 నుండి ఇంప్లెమెంట్ చెయ్యడానికి ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఏ ప్రక్రియ ఓటర్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయాలంటే, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని బీఎల్‌వోకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు చేస్తారు. మామూలుగా అయితే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. కానీ ప్రజలు చాలా మందికి అవగాహన ఉండదు. కాబట్టి అధికారులు చేస్తారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన వారు వాళ్ళను ప్రభావితం చేసి వాళ్లకు ఇష్టమొచ్చినట్టు చేస్తారనే వాదనలు రావడంతో ఎన్నికల కమిషన్ ఈ వార్నింగ్ ను జారీ చేసింది. ఐన జగన్ ప్రభుత్వానికి ఇలాంటి వార్నింగ్స్ కొత్తేమి కాదు కాబట్టి వీటిని పట్టించుకోకుండా ఎలాగో ఇష్టమొచ్చినట్టు చేస్తారు.

మొత్తం వాలంటీర్స్ చేతుల్లోనే

ప్రభుత్వం క్రియేట్ చేసిన ఈ కొత్త ఉద్యోగులు ప్రతి 50 కుటుంబాల ఇన్ఫర్మేషన్ ను తమ దగ్గర ఉంచుకొని ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు. చట్టానికి విరుద్దంగా కూడా పనులు చేస్తున్నారు. ఇలా చేస్తున్నారు కాబట్టే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చెయ్యాల్సి వస్తుంది. గతంలో ఉపఎన్నికల సమయంలోనూ వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారు. ప్రతి యాభై ఇళ్ల ఓటర్ల వివరాలు వాలంటీర్ ఫోన్‌లో ఉంటాయి. ఎన్నికల సమయంలో కూడా ఫోన్లను ఈసీ స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఎంత వరకు అమలు చేస్తారో చూడాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ఆదేశాలను ఎలాగో పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు చెయ్యడానికి రెడీ గా ఉంటుంది. జగన్ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ నుండి మళ్ళీ వార్నింగ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 15, 2022 at 8:15 ఉద.