MLA Atchannaidu: కరోనాపై ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోంది: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

Anil M

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…ఆక్సిజన్ అందక కరోనా బాధితులు పదుల సంఖ్యలో చనిపోతున్నా జగన్ రెడ్డిలో కనీసం చలనం లేదని, తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు ఆక్సిజన్ కొరతపై హెచ్చరించడం జరిగిందని, రుయా ఆసుపత్రి ఘటన దురదృష్టకరం. టీడీపీ హయంలో ఉన్నతంగా తీర్చిదిద్దిన రుయాను జగన్ రెడ్డి వచ్చిన తర్వాత నాశనం చేశారని, రుయా ఘటనపై టీడీపీ నిజనిర్థారణ కమిటీ వేయడం జరిగిందని, కరోనా బారిన పడి రోజూ వందలాది మంది మరణిస్తున్నా.. ప్రభుత్వం దొంగలు లెక్కలు చెబుతోందని, టీడీపీ కూడా కరోనా బాధితులను ఆదుకునేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేయడం జరిగిందని, నాయకులు తమకు వీలైన సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

దుర్మార్గంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు 

ఓ వైపు కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే జగన్ రెడ్డి దుర్మార్గంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, వ్యాక్సినేషన్ లో ఏపీ 28వ స్థానంలో ఉంది. దీనిని బట్టి కరోనాను ఎంత తేలికగా తీసుకుంటున్నారో అర్థమవుతోందని, చేతిలో అధికారాన్ని పెట్టుకుని ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని, వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీపైనా కులం ముద్ర వేసే స్థాయికి దిగజారారని, కరోనాను రాజకీయ చేయకూడదనే ఉద్దేశంతో టీడీపీ ఉంది. విలువైన సలహాలు, సూచనలు చేస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు. రూయా ఆసుపత్రిలో కరోనా మృతుల బంధువుల ఆర్తనాదాలు చూసైనా జగన్ రెడ్డికి కనువిప్పు కలగడం లేదు.
నారా లోకేష్ గారు కార్యకర్తలకు అండగా నిలిచారు. కరోనా అనేది మహా విపత్తు. అనేక మంది టీడీపీ నాయకులు చనిపోయారని, కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తలు పాటిస్తూనే ప్రజలకు అండగా నిలవాలని, కరోనాపై జగన్ రెడ్డి వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, సలహాదారులకు కోట్ల రూపాయలు జీతాలు చెల్లిస్తున్నారు. వారు ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలని, కరోనా వ్యాక్సిన్ కు రూ.1600 కోట్లు అవసరమైతే కేవలం రూ.43 కోట్లకు అనుమతులు ఇచ్చారని, కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. విపత్తు సమయంలో చంద్రబాబునాయుడు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

- Advertisement -