Gali Janardhan Reddy: రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి ఇంతా కాలం కర్ణాటక బీజేపీ పార్టీలో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసింది. గతంలో బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. అంతేకాకుండా క్యాబినెట్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈయన గతంలో అక్రమ గనుల తవ్వకాల సంబంధించిన కేసులో దొరకటంతో కొన్నేళ్లు జైల్లో కూడా ఉన్నాడు.
2009లో గనుల అక్రమ తవ్వకాల కుంభకోణంలో ఈయనతో పాటు తొమ్మిది మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో 2011లో ఈయనను అరెస్టు చేసి జైల్లో వేశారు. అలా నాలుగేళ్లు అయిన జైలు శిక్ష అనుభవించాడు. 2017 లో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ద్వారా బయటికి వచ్చాడు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు ఈయన బీజేపీలో కొనసాగాడు.
ఇక తాజాగా ఆయన కూడా సొంతంగా పార్టీని ఏర్పరచుకున్నాడు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పేరుతో సొంతంగా పార్టీని స్థాపించాడు. ఇక బీజేపీ శ్రేణులు మాత్రం ఈయనను పార్టీ నుండి దూరం కావొద్దు అని బ్రతిమాలిన కూడా ఆయన వినలేదని తెలిసింది. పైగా ఆయన బీజేపీ పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఇటీవల ఈయన గంగావతిలోని ఓ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం కోసం దాదాపు రూ.6 కోట్ల విరాళం అందివనున్నట్లు ప్రకటించాడని తెలిసింది.
Gali Janardhan Reddy: కొత్త పార్టీ పెట్టడానికి వాళ్లే కారణమా..
ఈయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం బీజేపీ శ్రేణుల అసంతృప్తి అని తెలుస్తుంది. అందుకే గత కొన్ని రోజుల నుండి గాలి జనార్ధన్ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడని వార్తలు వినిపించాయి. అందుకే ఆయన కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన భార్యతో కలిసి ఆ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.