Telangana: ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గురుకుల జూనియర్ కళాశాల నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కోసం విధ్యార్థులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కానీ తెలంగాణ ప్రభుత్వానికి కళ్ళు తెరుచుకోలేదు. ఏదైతే ఏమి కానీ మొత్తానికి నోటిఫికేషన్ వచ్చింది. 10వ తరగతి పరీక్షలు వచ్చే నెల ప్రారంభం కానున్నాయి. ఆ పరీక్షలు అయిపోయిన తరువాత ఇంటర్ చేయడానికి విధ్యార్థులకు గురుకుల కళాశాలల్లో అవకాశం కలిస్తూ, నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
లాస్ట్ డేట్ అండ్ ఫీజ్ ఎంతంటే
ఈనెల లాస్ట్ వరకు ధరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 200 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. tsrjdc. cvv. gov. in వెబ్సైట్ నుండి ధరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ లో ఉన్న 35 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ చేయాలనుకున్న వారు ఈ ఎక్సామ్ రాసి, ఈ కాలేజీలో జాయిన్ అవ్వొచ్చు. మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు విధ్యార్థులు హాల్ ticktes డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 6వ తేదీన మార్నింగ్ 10 గంటల నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు పరీక్ష జరగనుంది.
ఫుడ్ అలానే ఉంటాదా!!
చాలామంది పేద విధ్యార్థులు గురుకుల స్కూల్స్ లలో, గురుకుల కాలేజీలలో చదువు ఉంటారు. అయితే ప్రభుత్వం మాత్రం వాళ్ళకు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేకపోతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి వారానికి ఒక స్కూల్ లేదా గురుకుల కాలేజీలో ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల విధ్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి గురుకుల స్కూల్ లేదా కాలేజీలోని విధ్యార్థులు నాశిరకమైన ఫుడ్ తింటూ చదువుకుంటున్నారు. పేదవిధ్యార్థులు కదా వాలలేమి అడుగుతారులే అన్న ధైర్యం కావొచ్చు, ఎంతమంది విధ్యార్థులు అనారోగహయం పాలైన ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. వచ్చే సంవత్సరం నుండైన మంచి ఫుడ్ పెడుతారేమో చూద్దాం.